Google Photos: గూగుల్ ఫొటోస్ ఉచిత స్టోరేజ్ పెంచుకోవడం ఎలా?
దిశ, ఫీచర్స్ : టెక్ దిగ్గజం గూగుల్.. జూన్ 1నుంచి తమ ‘గూగుల్ ఫోటోల’ సర్వీస్ కొనసాగించేందుకు ప్రీమియం ప్యాకేజీలు ప్రకటించిన విషయం తెలిసిందే. 15జీబీ వరకు ఉచితంగా వాడుకునే అవకాశముండగా, మరింత క్లౌడ్ నిల్వను కోరుకునే వినియోగదారులు 100GB స్టోరేజ్ కోసం నెలకు 120 రూపాయల నుంచి ప్రారంభమయ్యే Google సబ్‌స్క్రిప్షన్ బేస్డ్ స్టోరేజ్ ప్రణాళికలను ఎంచుకోవచ్చు. అయితే అదనపు క్లౌడ్ స్టోరేజ్ కోసం డబ్బు ఖర్చు చేయకూడదనుకుంటే అందుకు గూగుల్ అందిస్తున్న 15GB ఉచిత […]
దిశ, ఫీచర్స్ : టెక్ దిగ్గజం గూగుల్.. జూన్ 1నుంచి తమ ‘గూగుల్ ఫోటోల’ సర్వీస్ కొనసాగించేందుకు ప్రీమియం ప్యాకేజీలు ప్రకటించిన విషయం తెలిసిందే. 15జీబీ వరకు ఉచితంగా వాడుకునే అవకాశముండగా, మరింత క్లౌడ్ నిల్వను కోరుకునే వినియోగదారులు 100GB స్టోరేజ్ కోసం నెలకు 120 రూపాయల నుంచి ప్రారంభమయ్యే Google సబ్‌స్క్రిప్షన్ బేస్డ్ స్టోరేజ్ ప్రణాళికలను ఎంచుకోవచ్చు. అయితే అదనపు క్లౌడ్ స్టోరేజ్ కోసం డబ్బు ఖర్చు చేయకూడదనుకుంటే అందుకు గూగుల్ అందిస్తున్న 15GB ఉచిత స్టోరేజ్ క్లియర్ చేయడం ఓ అత్యుత్తమైన మార్గం. కాగా మరి ఆ డేటాను డిలీట్ చేసేందుకు ఈజీ టిప్ మీకోసం.
గూగుల్ ఫొటోస్ క్లౌడ్ స్టోరేజ్‌లో అన్‌వాంటెడ్ ఐటెమ్స్ ఉండటం సహజం. అయితే వాటితో పాటు, ఫ్రీ15GB క్లౌడ్ స్టోరేజ్‌ను ఫిల్ చేస్తున్న అంశాలేమిటో గుర్తించేందుకు, వాటిని క్లియర్ చేసేందకు గూగుల్ వన్ (Google One) యాప్ అవసరం. ఈ యాప్‌లో ‘స్టోరేజ్’ టాబ్‌కు వెళ్లి క్లిక్ చేస్తు, అందులో జీమెయిల్, గూగుల్ డిస్క్ ఫైల్స్, గూగుల్ ఫోటోల డేటా సర్వీసెస్ ఉచిత స్టోరేజ్‌లో ఎంత ఆక్రమించాయో తెలుసుకోవచ్చు. ఈ డేటాను క్లియర్ చేయడానికి, కింద ఉన్న ‘ఫ్రీ అప్ అకౌంట్ స్టోరేజ్’ బటన్ నొక్కండి. దీని ద్వారా క్లౌడ్ స్టోరేజ్‌తో పాటు, బిన్‌లోని చెత్త కూడా శాశ్వతంగా డిలీట్ అయిపోతుంది. ఈ తాత్కాలిక పరిష్కారము కొంత స్టోరేజ్‌ను పెంచుతుంది. దీంతో మరిన్ని ఫొటోలను, ఈమెయిల్స్‌ను స్టోర్ చేసుకునే అవకాశముంటుంది. ఒకవేళ తొలగించడానికి ఎక్కువ అనవసరమైన ఫైల్‌లు లేనప్పుడు, మీరు మీ కంప్యూటర్‌లో ఆఫ్‌లైన్‌లో లేదా మరొక క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్‌కు కొన్ని ఫైల్‌లను బ్యాకప్ చేస్తే, అలా కూడా స్టోరేజ్ పెరుగుతుంది.