Google Meet: నచ్చిన ఫొటోలతో.. మీట్‌ బ్యాక్‌గ్రౌండ్ ఫీచర్

దిశ, ఫీచర్స్ : టెక్ దిగ్గజం గూగుల్ తమ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ ‘గూగుల్ మీట్’‌ (Google Meet) లో ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు ‘వర్చువల్ బ్యాక్‌గ్రౌండ్ ఫీచర్’ వెబ్ వెర్షన్‌కు మాత్రమే పరిమితం చేయగా, గూగుల్ దీన్ని మొబైల్‌కు విస్తరించింది. మీట్ యూజర్లు తమ బ్యాక్‌గ్రౌండ్‌ను ఆఫీస్ ప్లేసెస్, ప్రృకృతి దృశ్యాలు లేదా ఓన్ ఇమేజ్ కూడా వీడియో కాల్స్‌లో నేపథ్య చిత్రంగా ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు వీడియోను కూడా సెట్ చేసుకునే […]

Update: 2021-06-09 08:47 GMT

దిశ, ఫీచర్స్ : టెక్ దిగ్గజం గూగుల్ తమ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ ‘గూగుల్ మీట్’‌ (Google Meet) లో ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు ‘వర్చువల్ బ్యాక్‌గ్రౌండ్ ఫీచర్’ వెబ్ వెర్షన్‌కు మాత్రమే పరిమితం చేయగా, గూగుల్ దీన్ని మొబైల్‌కు విస్తరించింది. మీట్ యూజర్లు తమ బ్యాక్‌గ్రౌండ్‌ను ఆఫీస్ ప్లేసెస్, ప్రృకృతి దృశ్యాలు లేదా ఓన్ ఇమేజ్ కూడా వీడియో కాల్స్‌లో నేపథ్య చిత్రంగా ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు వీడియోను కూడా సెట్ చేసుకునే అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను స్టేజ్డ్ ఫార్మాట్‌లో విడుదల చేసిన గూగుల్, యూజర్‌లందరూ కూడా 15 రోజుల్లోగా యాక్సెస్ పొందాలని తెలిపింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్ భవిష్యత్తులో ఐఫోన్/ఐప్యాడ్‌లో అందుబాటులో ఉంటుంది. అయితే దీన్ని ఎలా సెట్ చేసుకోవాలో తెలుసుకుందాం.

* సెల్ఫ్ వ్యూ చూడటానికి స్క్రీన్‌ను ట్యాప్ చేయండి
* ఇప్పుడు ‘చేంజ్ బ్యాక్‌గ్రౌండ్’ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
* ‘బ్లర్ యువర్ బ్యాక్‌గ్రౌండ్’ ఆప్షన్‌ నుంచి కంప్లీట్లీ బ్లర్ యువర్ బ్యాక్‌గ్రౌండ్ ఎంచుకోవాలి.
* స్లైట్లీ బ్లర్ బ్యాక్‌గ్రౌండ్ ట్యాప్ చేయాలి.
* ఇప్పుడు ప్రి లోడెడ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకునేందుకు బ్యాక్‌గ్రౌండ్‌పై క్లిక్ చేయాలి.

గూగుల్ ఇటీవల యూజర్ ఇంటర్‌ఫేజ్‌ (యూఐ) లోనూ మార్పులు తీసుకొచ్చింది. కొత్త యూఐ సెట్టింగ్స్‌లో అవసరమైన అన్ని ఆప్షన్స్ యాక్సెస్ చేయడానికి బాటమ్‌లో ఓ యూఐ బార్ జత చేసింది. ఈ బార్‌లో మీటింగ్ కోడ్, మైక్రోఫోన్, వీడియో, శీర్షికలు, హ్యాండ్ రైజ్, స్క్రీన్ షేరింగ్ ఇతర టోగుల్స్ ఉన్నాయి. రైట్ బాటమ్‌లో.. జాయినింగ్ ఇన్ఫో, పీపుల్ ప్యానెల్, చాట్ ప్యానెల్, బ్రేక్అవుట్ రూమ్స్, పోల్స్ వంటి సమావేశ వివరాలను కనుగొనవచ్చు.

Tags:    

Similar News