ఫోన్‌కి బ్రేకప్ చెప్పడం ఎలా?
వాలెంటైన్స్ డే రోజున బ్రేకప్ గురించి మాట్లాడటం సబబు కాదు. కానీ ఈ బ్రేకప్ జరిగినపుడే అసలైన వాలెంటైన్ జీవితంలోకి రావడానికి మార్గం ఏర్పడుతుంది. అవును… స్మార్ట్‌ఫోన్ కారణంగా విడిపోతున్న ప్రేమ జంటలు చాలా ఉన్నాయంటే అతిశయోక్తి కాదేమో… నా బాయ్‌ఫ్రెండ్ నాకంటే ఎక్కువగా ఫోన్‌తోనే గడుపుతున్నాడంటూ ఫిర్యాదులు చేస్తున్న గర్ల్‌ఫ్రెండ్స్ లెక్కలేనంత మంది ఉన్నారు. అందుకే ముందు ఫోన్‌కి బ్రేకప్ చెప్పేస్తే జీవితాన్ని ఆనందంగా గడపొచ్చు. మరి అదెలాగో తెలుసుకుందాం. […]
వాలెంటైన్స్ డే రోజున బ్రేకప్ గురించి మాట్లాడటం సబబు కాదు. కానీ ఈ బ్రేకప్ జరిగినపుడే అసలైన వాలెంటైన్ జీవితంలోకి రావడానికి మార్గం ఏర్పడుతుంది. అవును… స్మార్ట్‌ఫోన్ కారణంగా విడిపోతున్న ప్రేమ జంటలు చాలా ఉన్నాయంటే అతిశయోక్తి కాదేమో… నా బాయ్‌ఫ్రెండ్ నాకంటే ఎక్కువగా ఫోన్‌తోనే గడుపుతున్నాడంటూ ఫిర్యాదులు చేస్తున్న గర్ల్‌ఫ్రెండ్స్ లెక్కలేనంత మంది ఉన్నారు. అందుకే ముందు ఫోన్‌కి బ్రేకప్ చెప్పేస్తే జీవితాన్ని ఆనందంగా గడపొచ్చు. మరి అదెలాగో తెలుసుకుందాం.
ఈ విషయాల్లో సాయం చేయడానికి ‘హౌ టూ బ్రేకప్ విత్ యువర్ ఫోన్’ పుస్తక రచయిత కేథరీన్ ప్రైజ్ కొన్ని సలహాలు సూచనలు అందించారు. అందులో భాగంగా ఫోన్‌ని దూరంగా పెట్టాలన్న ఆలోచనను ముందుగా మనసులో బలంగా అనుకోవాలని ఆమె చెబుతున్నారు. అందుకోసం బ్రేకప్ ఛాలెంజ్ అని ఒకటి రూపొందించుకోవాలి. ఏడు రోజుల పాటు దీన్ని ప్రయత్నించి భాగస్వామితో గడిపే సమయంలో వచ్చిన మార్పును అంచనా వేసి మరో ఏడు రోజులకు పొడిగిస్తూ… ఫోన్ దూరం పెట్టడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి.
అలా కాకుండా ఫోన్ ద్వారా చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు ఉంటాయి. ఉదాహరణకు పుస్తకాలు చదవడం, మెడిటేషన్ చేయడానికి ఉపయోగించడం వంటి వాటికి ఎక్కువ సమయం కేటాయిస్తూ సోషల్ మీడియా యాప్‌లకు తక్కువ సమయం కేటాయించేలా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే నాణ్యత గల జీవితాన్ని జీవించడానికి అవకాశం దొరుకుతుంది.
ముందు అవసరాలు గుర్తించాలి
ముందు ఫోన్ ఎందుకు ఎక్కువగా వాడుతున్నామో అంచనా వేసుకోవాలి. ‘ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ (ఫోమో)’ అనే భావనను వినియోగదారుడిలో కలిగించేలా యాప్స్‌ను డిజైన్ చేస్తారు. దీని ద్వారా ఫోన్ లేకపోతే ఏదో కోల్పోతున్నామన్న భావన కలుగుతుంది. ఈ భావనను అధిగమించాలంటే ముందు ఏం కోల్పోతున్నామో ఒక స్పష్టత తెచ్చుకోవాలి. ఏదైనా యాప్ ఉపయోగించే ముందు ఇప్పుడు ఈ యాప్ వాడకపోతే కలిగే నష్టం ఏంటి, వాడితే కలిగే లాభమేంటి అనే లెక్క వేసుకోవాలి. లాభాలు ఎక్కువ ఉన్న యాప్‌కి ఎక్కువ సమయం, తక్కువ ఉన్న యాప్‌కి తక్కువ సమయం కేటాయించాలి.
కొన్నిసార్లు పూర్తిగా సోషల్ మీడియాలో అన్ని చూసేసి ఫోన్ పక్కకి పడేస్తారు. కానీ మళ్లీ కొన్ని నిమిషాల్లోనే ఫోన్ వైపు చేయి వెళ్తుంది. ఇలా వెళ్లకుండా ఉండటానికి ‘స్పీడ్ బంప్’ అనే టెక్నిక్ ఉపయోగపడుతుంది. ఈ టెక్నిక్‌లో ఫోన్ వాడటం పూర్తయ్యాక దానికి ఒక రబ్బర్ బ్యాండ్ తొడగాలి. మళ్లీ ఫోన్ తీసుకోవాలని అనిపించినపుడు ఆ రబ్బర్ బ్యాండ్ చూసి ఫోన్ వాడటానికి బదులుగా ఇంకా వేరే చేయాల్సిన పనుల గురించి ఆలోచించి, వాటి మీద దృష్టి సారించాలి.
స్క్రీన్ టైమ్ అనేది తప్పుడు కొలమానం
సాధారణంగా మొబైల్ ఎంతసేపు వాడుతున్నామనే విషయాన్ని స్క్రీన్ టైమ్ ఆధారంగా కొలుస్తారు. స్క్రీన్ ఎంతసేపు ఆన్‌లో ఉంది అనే దాని ఆధారంగా ఇది కొలుస్తుంది. అయితే ఇది తప్పుడు కొలమానం అని ప్రైజ్ అంటున్నారు. ఉదాహరణకు మొబైల్ మీద 10 నిమిషాలు ఉండి, మిగతా 8 గంటలు ల్యాప్‌ట్యాప్ మీద పనిచేస్తే అప్పుడు స్క్రీన్ టైమ్ పది నిమిషాలు అని అంచనా వేయడం తప్పు అవుతుందని ఆమె వివరించారు.
ఫోన్‌తో బ్రేకప్ అంటే పూర్తిగా ఫోన్ వదిలేయమని కాదు… అవసరమైన విషయాలకు మాత్రమే ఫోన్ ఉపయోగించి నిజజీవితంలో గడపడానికి ప్రయత్నించడమని ఆమె నిర్వచిస్తున్నారు. ఫోన్ మీద ఎంత తక్కువ సమయం వెచ్చించామనేది కాకుండా నిజజీవితంలో ఎంత ఎక్కువ సమయం వెచ్చించామనే అంశం మీద దృష్టి సారించాలని ఆమె సలహా ఇచ్చారు. మరి ఇంకేం… ఫోన్‌కి బ్రేకప్ చెప్పేసి, లవ్ ఆఫ్ లైఫ్‌కి వెల్‌కమ్ చెప్పేసేయండి.