రేపటి నుంచే దరఖాస్తులు.. ఆసరా ఫించన్లకు అప్లై చేసుకోండిలా..

దిశ, తెలంగాణ బ్యూరో: ఆసరా పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైనవారు సోమవారం (అక్టోబరు 11) నుంచే ‘మీ సేవ’ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రధాన కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు గడువు ఉందని, అన్ని ‘మీ సేవ’ కేంద్రాలకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఆసరా పింఛన్ల లబ్ధిదారుల వయసును 57 ఏళ్ళకు కుదించినందున అర్హులైనవారంతా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. […]

Update: 2021-10-09 20:13 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఆసరా పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైనవారు సోమవారం (అక్టోబరు 11) నుంచే ‘మీ సేవ’ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రధాన కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు గడువు ఉందని, అన్ని ‘మీ సేవ’ కేంద్రాలకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఆసరా పింఛన్ల లబ్ధిదారుల వయసును 57 ఏళ్ళకు కుదించినందున అర్హులైనవారంతా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇప్పటికే ఒకసారి అవకాశం ఇచ్చామని, కానీ చాలా మంది దరఖాస్తు చేసుకోలేకపోయారని, మరోసారి అవకాశం ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యేలు ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో ముఖ్యమంత్రి ఆదేశం మేరకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

అర్హులైనవారంతా ఈసారి దరఖాస్తు చేసుకోవాలని కోరడంతోపాటు వారి వివరాలను స్క్రూటినీ చేసి అర్హత కలిగినవారందరికీ వెంటనే గుర్తింపు కల్పించి ఆసరా పింఛన్లు మంజూరయ్యేలా చూడాలని పంచాయతీరాజ్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను ఆదేశించారు. ‘మీ సేవ’ కేంద్రాల్లో తగిన ఆప్షన్లను కల్పించాల్సిందిగా తెలంగాణ స్టేట్ టెక్నలాజికల్ సర్వీసెస్ ఎంపీ వెంకటేశ్వరరావును ఆదేశించారు.

Tags:    

Similar News