అనిల్ కపూర్.. లవ్ ముచ్చట్లు
బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్, సునీత కపూర్ దంపతులకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం వారి పెళ్లి రోజు సందర్భంగా.. తమ వివాహం ఎలా జరిగిందో వివరిస్తూ.. పెళ్ళినాటి ఫోటోలను షేర్ చేశాడు అనిల్ కపూర్. మే 19 మా జీవితంలో ఎందుకు ప్రత్యేకమో తెలుసుకోండి అంటూ అభిమానులకు తన లవ్ స్టోరీ చెప్పాడు. https://www.instagram.com/p/CAXQnEmhk3N/?utm_source=ig_web_copy_link ఓ రోజు తన గర్ల్ ఫ్రెండ్ సునీతకు ‘నా భార్యగా ఉంటావా ? అంటూ ప్రపోజ్ చేశారట […]
బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్, సునీత కపూర్ దంపతులకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం వారి పెళ్లి రోజు సందర్భంగా.. తమ వివాహం ఎలా జరిగిందో వివరిస్తూ.. పెళ్ళినాటి ఫోటోలను షేర్ చేశాడు అనిల్ కపూర్. మే 19 మా జీవితంలో ఎందుకు ప్రత్యేకమో తెలుసుకోండి అంటూ అభిమానులకు తన లవ్ స్టోరీ చెప్పాడు.
https://www.instagram.com/p/CAXQnEmhk3N/?utm_source=ig_web_copy_link
ఓ రోజు తన గర్ల్ ఫ్రెండ్ సునీతకు ‘నా భార్యగా ఉంటావా ? అంటూ ప్రపోజ్ చేశారట అనిల్. కానీ, ఆ తర్వాత తనను సుఖంగా ఉంచగలనా లేదా అనే భయం మొదలైందట. ఈ ఆలోచనలతో సతమతమైన అనిల్.. వెంటనే ఒక ఇళ్లు కొని, కుక్‌ను అపాయింట్ చేశాడట. ఇక మే 19న తనను పెళ్లి చేసుకున్న అనిల్ అప్పటి విషయాలను గుర్తుచేసుకున్నాడు. ‘ఆ రోజు సునీతను పెళ్లి కూతురిగా చూడగానే ఆనందంతో నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఒక్క రోజులోనే మా పెళ్లి గురించి ప్లాన్ చేయడం, ఆ వెంటనే పెళ్లి జరిగిపోవడం.. అంతా ఫాస్ట్ ఫాస్ట్‌గా అయిపోయింది. పెళ్లి హడావిడిగా జరగడంతో హనీమూన్‌కు కూడా వెళ్లలేదని నా భార్య ఇప్పటికీ ఆటపట్టిస్తుంది’ అని చెప్పారు. కానీ, జీవితంలో ఎప్పటికీ ది బెస్ట్ అని చెప్పే విషయం తన పెళ్లి మాత్రమేనని, అప్పటి నుంచి ఇప్పటి వరకు మేం అంతే ప్రేమగా, సంతోషంగా ఉన్నామని అంటున్నారు.
తానెప్పుడూ ప్రేమా లేక కెరియరా ? అని ఆలోచించలేదని.. ప్రేమ, కెరీర్ అనే ముందుకు సాగానని అంటున్నారు. ఇంకా మేం ఒకరికి ఒకరం చాలా ప్రేమను పంచాల్సి ఉంది.. ‘హ్యాపీ యానివర్సరీ మై లవ్ ఆఫ్ లైఫ్, మై వైఫ్ సునీత కపూర్’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు అనిల్ కపూర్.