సెలెబ్రిటీగా మారిన పిల్లి

దిశ, వెబ్‌డెస్క్: కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కంపెనీలన్నీ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని కల్పించింది. సాఫ్ట్‌వేర్ సంస్థలే కాకుండా మీడియా సంస్థలు కూడా తమ ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడానికి అనుమతి ఇచ్చింది. అమెరికాలోని ఇండియానాకు చెందిన జెఫ్ఫీ లయాన్ అనే యాంకర్ ’14 న్యూస్’ ఛానల్‌లో వాతావరణ వార్తలు చదువుతుంటాడు. కరోనా నేపథ్యంలో అతనికి వర్క్ ఫ్రం హోం కేటాయించడంతో ఇంట్లోనే గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేసుకొని వార్తలు చదవుతున్నాడు. […]

Update: 2020-05-03 11:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కంపెనీలన్నీ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని కల్పించింది. సాఫ్ట్‌వేర్ సంస్థలే కాకుండా మీడియా సంస్థలు కూడా తమ ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడానికి అనుమతి ఇచ్చింది. అమెరికాలోని ఇండియానాకు చెందిన జెఫ్ఫీ లయాన్ అనే యాంకర్ ’14 న్యూస్’ ఛానల్‌లో వాతావరణ వార్తలు చదువుతుంటాడు. కరోనా నేపథ్యంలో అతనికి వర్క్ ఫ్రం హోం కేటాయించడంతో ఇంట్లోనే గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేసుకొని వార్తలు చదవుతున్నాడు. ఇలా ఒక రోజు లైవ్‌లో వాతావరణ వార్తలు చదువుతుండగా తన పెంపుడు పిల్లి ‘బెట్టి’ కెమెరా ముందుకు వచ్చి డిస్ట్రబ్ చేసింది. ఆ పిల్లి అలా గోల చేస్తుండగానే తను వార్తలు చదివేశాడు. ఈ వార్తలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఆ పిల్లిని మళ్లీ వార్తల్లో చూపాలని కోరుతూ మెసేజెస్ పెట్టారు. దీంతో వెదర్ రిపోర్ట్ చదివే ప్రతీసారి ‘బెట్టీ’ కూడా పక్కన కూర్చోబెడుతున్నారు. అలా డిస్ట్రబ్ చేసిన పిల్లి సెలెబ్రిటీగా మారిపోయింది. ఇప్పుడు ఏకంగా ఆ పిల్లి కోసం ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా తెరిచి.. ఆ క్యాట్ డైలీ రొటీన్స్‌ను సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇప్పుడు అమెరికాలో ఆ పిల్లికి ఎందరో అభిమానులు ఉన్నారు.

Tags : Betty, Celebrity Cat, Indiana, USA, 14 News, Weather Report, Jeff Lyons

Tags:    

Similar News