Today's Horoscope: ఈ రోజు రాశి ఫలాలు ( 11-12-2024)
ఈ రోజు రాశి ఫలాలు ( 11-12-2024)
మేష రాశి : మేష రాశి వారికీ ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు చేసే వారికీ ఇది మంచి సమయం. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల నెరవేరుతుంది. అలాగే, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టె వారికీ అధిక లాభాలు వస్తాయి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
వృషభ రాశి: సంతృప్తికరమైన జీవితం కోసం మీ మానసిక శక్తిని పెంపొందించుకోండి. ఈ రోజు ఉదయం కొంచం మీకు అశాంతి కలిగించవచ్చును. మీ పాత స్నేహితులను కలుసుకుని మీ బాధలు షేర్ చేసుకుంటారు. టెన్షన్ ను పక్కన పెట్టి మీతో మీరు కొంత సమయం గడపండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి చెప్పిన పనిని చేయండి.
మిథున రాశి : ఈ రోజు మిథున రాశి వారు ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారు. ఈ రాశి వారు రియల్ ఎస్టేట్ రంగంలో అనుకున్న పనులన్నీ సాధిస్తారు. కొత్తగా వ్యాపారాలు చేసే వారికీ విపరీతంగా లాభాలు వస్తాయి. కోర్టు సమస్యల్లో ఇరుక్కున్న వారు వాటి నుంచి బయటపడతారు.
కర్కాటక రాశి : ఈ రోజు ప్రారంభం కర్కాటక రాశి వారికీ మంచిగా ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. అలాగే, విదేశాలకు వెళ్లాలనునే వారి కల నెరవేరుతుంది. మీరు మొదలు పెట్టిన పనులలో మీ కుటుంబ సభ్యుల సపోర్ట్ దొరుకుతుంది. మీ వైవాహిక జీవితం అద్భుతంగ మారుతుంది. మీ వల్ల సహాయం పొందిన వారు మీ వద్దకే తిరిగి వస్తారు.
సింహ రాశి : ఈ రోజు మీరు వెతుకుతున్న మీ కలల రాణి కనిపిస్తుంది. చూసిన మొదటి సారిలోనే ప్రేమలో పడతారు. మీకు ఇష్టమైన సామాజిక సేవల్లో పాల్గొనడానికి సమయాన్ని వెచ్చించండి. మీ చుట్టుపక్కల వారి ప్రవర్తన కారణంగా మీకు చాల కోపం వస్తుంది. ఈ రోజు సాయంత్రం మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
కన్యా రాశి: ఆరోగ్య సమస్యల విషయంలో మీ స్వంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మీ అవాస్తవ, ఆచరణ సాధ్యం కాని ప్రణాళికలు డబ్బు కొరతకు దారితీయవు. మీ కఠినమైన ప్రవర్తన మీ పిల్లలకు కోపం తెప్పిస్తుంది. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి, లేకపోతే మీ మధ్య అడ్డంకి ఏర్పడుతుంది.
తులా రాశి: ఈ రోజు.. ఈ రాశికి చెందిన కొందరు విద్యార్థులు టీవీ, కంప్యూటర్లు చూస్తూ సమయాన్ని గడుపుతున్నారు. మీ కుటుంబ జీవితాన్ని మెరుగుపరచడానికి మీరు చేసే ప్రయత్నాలు మీ అంచనాలను మించి ఈరోజు మిమ్మల్ని సంతోషపరుస్తాయి.
వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో సంతోషంగా ఉంటారు. వ్యాపారులు ఈరోజు వ్యాపారంలో కొన్ని మార్పులు చేయాలని ఆలోచిస్తారు. దీంతో భవిష్యత్తులో మీకు కచ్చితంగా ప్రయోజనం చేకూరుతుంది. మీ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు.
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికీ ఈ సమయం అద్భుతంగా ఉండనుంది. అంతే కాకుండా, అప్పుగా ఇచ్చిన డబ్బు మీ దగ్గరకి ఇస్తుంది. అలాగే, సమాజంలో మీ గౌరవం కూడా పెరుగుతుంది. మీకు నచ్చిన వాళ్ళతో ఎక్కువ సమయం గడుపుతారు. మీరు మొదలు పెట్టిన ప్రతీ పనిలో విజయం సాధిస్తారు.
మకర రాశి: ఈ రాశి వారు ఈరోజు తీసుకున్న నిర్ణయం వల్ల కొత్త సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులన్ని పూర్తి చేస్తారు. మీ ప్రియమైన వారు మీ మీద అలుగుతారు.. కొంచం ఓపిక తెచ్చుకుని వారిని బుజ్జగించండి.
కుంభ రాశి: మీశక్తిని తిరిగి పొందడానికి పూర్తిగా విశ్రాంతి తీసుకోండి. ఎందుకంటే బలహీనమైన శరీరం మనస్సును బలహీనపరుస్తుంది. స్థిరమైన విభేదాలు మీకు మరియు మీ భార్యకు ఒకరినొకరు ఒప్పించడం చాలా కష్టతరం చేస్తాయి.
మీన రాశి: ఈ రోజు ఈ రాశి వారు కొత్త పనులను మొదలు పెడతారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. గ్రహాన్ని బట్టి ఎవరైనా మీకు ప్రపోజ్ చేసే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టేవారు ఒకటికి, రెండు సార్లు ఆలోచించుకుని పెట్టండి.. లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది. మీరు ఈ రోజు ఎవరి దగ్గర అప్పు తీసుకోకండి. దాని వల్ల గొడవలు జరిగే అవకాశం ఉంది.