ఈ రాశుల వారికి తీవ్ర నష్టాలు.. జ్యోతిష్యులు ఏమి చెబుతున్నారంటే..?
ఈ రాశుల వారికి తీవ్ర నష్టాలు
దిశ, ఫీచర్స్: హిందూ సంప్రదాయం ప్రకారం, బుద్ధుని పౌర్ణమి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ప్రతి సంవత్సరం ఈ పౌర్ణమి మే చివరి వారంలో లేదా జూన్ మొదటి వారంలో వస్తుంది. ఈ పౌర్ణమి రోజున బుద్ధుడు అవతరించినందున ప్రతి సంవత్సరం బుద్ధ పౌర్ణమిని జరుపుకోవడం ఆనవాయితీ. ఈ సంవత్సరం బుద్ధ పౌర్ణమి మే 23 న వస్తుంది. బుద్ధుని అవతారం రోజున కొన్ని గ్రహాలు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అందువల్ల, ఈ బుద్ధ పౌర్ణమి ఈ రాశుల వారికి తీవ్రమైన నష్టాలు తప్పవని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..
మిథున రాశి
మిథునరాశికి చెందిన వారు బుద్ధ పౌర్ణమి రోజున జీవితంలో కొన్ని హెచ్చు తగ్గులు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు చిన్న చిన్న పనుల విషయంలో సహోద్యోగులతో వాగ్వాదాలు తలెత్తవచ్చు. దీంతోపాటు ఇటీవల ప్రారంభించిన పనులు కూడా ఆగిపోయే అవకాశం ఉంది. కావున కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్లాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
సింహ రాశి
సింహరాశి వారికి ఈ సమయంలో ఆర్ధిక సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఖర్చులు కూడా పెరగవచ్చు. కాబట్టి వారు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు వారితో ఉన్నప్పుడు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఈ సమయంలో అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.