నవపంచమ యోగం.. ఈ రాశులవారికి గుడ్ డేస్ స్టార్ట్..

జ్యోతిష్యంలో ఒక్కో గ్రహానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.

Update: 2024-05-15 03:19 GMT

దిశ, ఫీచర్స్: వేద జ్యోతిష్యంలో ఒక్కో గ్రహానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. జ్యోతిషశాస్త్రంలో బృహస్పతికి భిన్నమైన లక్షణాలు ఉన్నాయి. కేతువును నీడ గ్రహంగా పరిగణించినట్లయితే, బృహస్పతి ప్రధాన గ్రహాలలో ఒకటిగా చెబుతారు. అయితే, కేతువు ,గురు గ్రహాల అనుకూల స్థానం కారణంగా.. 100 సంవత్సరాల తర్వాత నవ పంచమ యోగం ఏర్పడనుంది. దీని ప్రభావం కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉండనుంది. ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..

మిథున రాశి

నవ పంచమ యోగం మిథున రాశికి వారికి లాభాలను తెచ్చి పెట్టనుంది. వ్యాపారవేత్తలకు కొత్త సంపాదన అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ సమయంలో చిన్న చిన్న సమస్యలు పరిష్కారమవుతాయి. ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తే అవి విజయాన్ని అందిస్తాయి. వ్యాపార ఒప్పందాల డీల్స్ కుదిరే అవకాశం ఉంది.

మకర రాశి

నవ పంచమ యోగం వలన మకర ఈ రాశికి మంచిగా ఉండనుంది. ఈ సమయంలో, వారు ఎక్కడ పనిచేసినా విజయం సాధిస్తారు. సహోద్యోగులు, ఉన్నతాధికారుల పూర్తి సహకారాన్ని పొందుతారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త పెట్టుబడులకు ఇది సరైన సమయం. ఈ సమయంలో మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.


Similar News