గురు చండాల యోగం.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, యోగాలు ప్రజల జీవితాల్లో పెద్ద మార్పును కలిగిస్తాయి.

Update: 2024-06-28 04:42 GMT

దిశ, ఫీచర్స్ : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, యోగాలు ప్రజల జీవితాల్లో పెద్ద మార్పును కలిగిస్తాయి. గురు, కేతు గ్రహంతో కలవడం వలన గురు చండాల యోగం ఏర్పడుతుంది. ఈ కారణంగానే డబ్బుతో పాటు విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశిలోకి సంచారం చేస్తుంటాయి. వాటి ప్రభావం వల్ల రకరకాల యోగాలు వస్తాయి. వీటిలో కొన్ని అనుకూల ఫలితాలు మరి కొన్ని ప్రతికూల ఫలితాలనిస్తాయి. ఇది ఒక వ్యక్తి జీవితంలో కొత్త రకాల మార్పులకు దారితీస్తుంది. గురు చండాల యోగం ఈ రాశుల వారి జీవితంలో గొప్ప ప్రయోజనాలను తెచ్చి పెట్టనుంది. ఆ రాశు లేంటో ఇక్కడ తెలుసుకుందాం..

వృషభ రాశి

గురుచండాల యోగం వల్ల వృషభ రాశి వారు కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ద పడతారు. మీ ఖాళీ సమయంలో స్నేహితులను కలుసుకుని వినోదాలలో పాల్గొంటారు. మీ ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.. ఈ సమయంలో కొత్త ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు.

కన్య రాశి

కన్యా రాశి వారు, అనుకోని విధంగా డబ్బు సంపాదిస్తారు. సోదరులతో ఐక్యత నెలకొంటుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయం చేస్తారు. పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్లకి ఈ సమయం కలిసి వస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు పెరుగుతాయి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.


Similar News