ఆగస్టు నెల ఏ రాశుల వారికి కలిసి వస్తుందో తెలుసా?
ఆగస్టు నెలలో బుధుడు, శుక్రుడు, కుజుడు తమ రాశిని మార్చుకోబోతున్నారు. ఆగస్టు 5న బుధుడు సింహరాశిలోకి, ఆగస్టు 16న సూర్యదేవుడు సింహరాశిలోకి, ఆగస్టు 25న శుక్రుడు కన్యారాశిలోకి, ఆగస్టు 26న కుజుడు
దిశ, ఫీచర్స్ : ఆగస్టు నెలలో బుధుడు, శుక్రుడు, కుజుడు తమ రాశిని మార్చుకోబోతున్నారు. ఆగస్టు 5న బుధుడు సింహరాశిలోకి, ఆగస్టు 16న సూర్యదేవుడు సింహరాశిలోకి, ఆగస్టు 25న శుక్రుడు కన్యారాశిలోకి, ఆగస్టు 26న కుజుడు మిథున రాశిలోకి సంచరించనున్నాయి. దీంతో నాలుగు రాశుల వారికి ఈ ఈ నెల అద్భుతంగా ఉండబోతుంది. కాగా ఆ నాలుగు రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.
వృషభ రాశి : ఈ రాశి వారికి ఆగస్టు నెల మొత్తం అద్భుతంగా ఉండబోతుంది. విద్యార్థులకు కలిసి వస్తుంది. ఉద్యోగస్థులు ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
సింహ రాశి : ఈ రాశి వారికి ఆగస్టు నెల కలిసి వస్తుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే వారికి ఈ సమయం అనుకూలమైన సమయం. వైవాహిక జీవితంలోని సమస్యలన్నీ తొలిగిపోయి, చాలా సంతోషంగా గడుపుతారు. విద్యార్థులు విదేశాల్లో సీటు సాధిస్తారు. అదృష్టం కలిసి రావడంతో ఆనందంగా గడుపుతారు.
వృశ్చిక రాశి : ఈ రాశి వారు ఈ నెల మొత్తం చాలా ఆనందంగా గడుపుతారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే వారికి అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసంతో పని చేస్తారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. దీంతో వీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.
మకర రాశి : ఈ రాశి వారు ఈ నెలలో అదృష్టం కలిసి రావడం వలన చాలా సంతోషంగా గడుపుతారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వారికి ఇది మంచి సమయం. ఒత్తి, టెన్షన్ వంటి సమస్యల నుంచి బయటపడుతారు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి.