బుధాదిత్య యోగం.. ఆ రాశుల వారికీ డబ్బే డబ్బు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బుధుడు ప్రతి నెల ఒక రాశి నుండి మరొక రాశికి మారతాడు.
దిశ, ఫీచర్స్: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బుధుడు ప్రతి నెల ఒక రాశి నుండి మరొక రాశికి మారతాడు. చాలా శక్తివంతమైన సూర్యుడు ప్రతి 30 రోజులకు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇదిలా ఉండగా, బుధుడు జూన్ 29న కర్కాటకంలోకి ప్రవేశించాడు. ఈ జూలై 16న సూర్యుడు సంచారం చేయనున్నాడు. కాబట్టి, ఒకే రాశిలో సూర్యుడు, బుధుడు కలయిక జరగనుంది. ఈ కారణంగా చాలా శక్తివంతమైన బుధాదిత్య యోగం ఏర్పడనుంది. ఈ సమయంలో రెండు రాశులు వారు శుభ ఫలితాలు పొందనున్నారు. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..
కన్య రాశి
కన్యా రాశి వారికి బుధాదిత్య యోగం వలన మంచి రోజులు రానున్నాయి. పెండింగ్ పనులన్ని పూర్తి చేస్తారు. కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టిన వారికి లాభాలు పెరుగుతాయి. ఈ రోజుల్లో, వ్యాపారులకు అనేక పెట్టుబడి ఎంపికలు ఉన్నాయి. అంతేకాకుండా, కంపెనీలలో తలెత్తే సమస్యలు కూడా సులభంగా పరిష్కరించబడతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు బుధాదిత్య యోగం వలన అనేక ప్రయోజనాలను పొందుతారు. పని చేస్తున్న వారికి, ఈ సమయం కలిసి వస్తుంది. అంతేకాకుండా సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు ఎప్పటినుంచో అనుకున్నవి జరుగుతాయి. వైవాహిక జీవితంలో తలెత్తే సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. కోరికలు కూడా నెరవేరుతాయి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.