Shani Dev: 2025 లో ఆ రాశివారిపై ఏలినాటి శని దెబ్బ గట్టిగానే ఉంటుందంటున్న జ్యోతిష్యులు
భార్యా భర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు విడిపోయేవరకు వెళ్తాయి.
దిశ, వెబ్ డెస్క్ : 2025 ఏడాది త్వరలో రానుంది. ఈ సంవత్సరంలో కుంభ రాశి ( kumbha rashi) వారి జాతకం ఎలా ఉంటుందో .. జ్యోతిష్యులు వెల్లడించారు. ఈ ఏడాది కుంభ రాశి వారికి ఆదాయం 8 వ్యయం 14, రాజ పూజ్యం 7 ,అవమానం 5.
ఏలినాటి శని ప్రభావాన్ని ఖచ్చితంగా చూస్తారని అంటున్నారు. ఇంట్లో మీరు ఊహించని విధంగా ఖర్చులు పెరుగుతాయి. మీ తల్లిదండ్రులకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీని వలన మీరు ప్రశాంతంగా ఉండలేరు. సంతానం కోసం ప్రయత్నించే వారికీ ఊహించని ప్రమాదాలకు కూడా లోనవుతారు. భార్యా భర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు విడిపోయేవరకు వెళ్తాయి.
ఈ రాశి విద్యార్థులకు సంబంధించి ఉత్తీర్ణత శాతం కూడా చాలా వరకుతగ్గుతుంది. చెడు స్నేహాలు, చెడు అలవాట్లు, వలన దంపతుల మధ్య రోజూ గొడవలు జరుగుతుంటాయి. మీ మధ్యలో మూడో వ్యక్తి ప్రేమ పేరుతో ఎంటర్ అవుతారు దీని వలన మీరు మోసపోయే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లిన వారు ఉద్యోగాలు రాక తిరిగి వచ్చేస్తారు. కుంభరాశి ఉద్యోగస్తులు కేసులలో చిక్కుకుంటారని జ్యోతిష్యులు చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.