ఈ రాశి వాళ్లు ఇంత గమ్మత్తుగా ఉంటారా...? బ్యాంక్‌లోనూ జాతక ఫలమే..!
గ్రహాలు, జాతకం, రాశి ఫలాలు, అదృష్టం ఇలా ప్రతి దానిని అతిగా నమ్ముకుని పని చేస్తుంటారు కొందరు. పెళ్లిలు, శుభకార్యం, గృహ నిర్మాణం ఇలా కొన్నింటికి ముహూర్త బలం చూసుకునే వాళ్లను చూస్తుంటాం
దిశ, వెబ్‌డెస్క్ : గ్రహాలు, జాతకం, రాశి ఫలాలు, అదృష్టం ఇలా ప్రతి దానిని అతిగా నమ్ముకుని పని చేస్తుంటారు కొందరు. పెళ్లిలు, శుభకార్యం, గృహ నిర్మాణం ఇలా కొన్నింటికి ముహూర్త బలం చూసుకునే వాళ్లను చూస్తుంటాం. కానీ.. బ్యాంకులో డబ్బులను జమ చేసుకునేందుకు కూడా రాశులను అనుసరించేవారిని చూసి ఉండరు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి చేసిన పని చూసి నెట్టింట నవ్వులు చిందుతున్నాయి. అతడి చేష్టలకు ఔరా.. ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా.. అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకూ అతడు చేసిన ఘన కార్యం ఏంటంటే..
యూపీలోని మొరాదాబాద్ ఇండియన్ బ్యాంక్‌లో ఓ వ్యక్తి రూ.1000లను డిపాజిట్ చేశాడు. అయితే ఓచర్ స్లిప్‌లో ఖాతాదారుడి పేరు, అకౌంట్ నంబర్, బ్రాంచ్ పేరు, నగదు ఇలా కాలమ్స్ ఉన్నాయి. కాగా, అన్నీ సక్రమంగా రాసిన అతడు అకౌంట్ నంబర్ కాలమ్‌లో ''తులరాశి'' అని పేర్కొనడం ఆసక్తిని రేకిత్తించడంతోపాటు నవ్వులు తెప్పిస్తోంది. అయితే ఈ ఖాతాదారుడు ఈ ఏడాది ఏప్రిల్ 12న నగదును డిపాజిట్ చేయగా.. దానిని @NationFirst78 అనే ట్విట్టర్ యూజర్ ఏప్రిల్ 12న పోస్ట్ చేశాడు. దీంతో అది ఇన్నాళ్లుకు వైరల్‌గా మారింది. అయితే నెటిజన్లు మాత్రం ఆ ఖాతాదారుడిని రకరకాల కామెంట్లతో టీజ్ చేస్తున్నారు. తులరాశి వాళ్లు మరీ ఇలా ఉంటారా..? ఈ రాశి వాళ్లు ఇలాంటి విన్యాసాలు చేస్తారా..? అంటూ ఫన్నీ కామెంట్లతో ఆడుకుంటున్నారు. కాగా, ఓచర్ స్లిప్‌లో చిన్న అక్షరం తప్పుపడినా రిజక్ట్ చేసే బ్యాంక్ అధికారులు సదరు ''తుల రాశి'' ఖాతాదారుడి డబ్బులను మాత్రం జమ చేసుకోవడం గమనార్హం.
कितने तेजस्वी लोग हैं।
— Anoop Kotwal🇮🇳 (@NationFirst78) April 16, 2022
Dedicated to @singhkhushboo61
(तुला राशि)😜😜😜 pic.twitter.com/sstwLZfAc6