అల్లుడి కోసం దీదీ పాలన : అమిత్ షా

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో పరిస్థితులు వామపక్షాల పాలనలో కన్నా దీదీ హయాంలో దారుణంగా దిగాజారిపోయాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. సీఎం మమతా బెనర్జీ బెంగాల్ ప్రజల ఆశలను వమ్ముచేశారని, అందుకే టీఎంసీ పార్టీ నుంచి నేతలు బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. ఎన్నికలు వచ్చే సమయానికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఆమె ఒక్కరే ఒంటరిగా మిగిలిపోతారని అన్నారు. అనివార్య కారణాల వల్ల బెంగాల్ పర్యటన రద్దు చేసుకున్న అమిత్ షా ఆదివారం హౌరాలో నిర్వహించిన […]

Update: 2021-01-31 11:36 GMT

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో పరిస్థితులు వామపక్షాల పాలనలో కన్నా దీదీ హయాంలో దారుణంగా దిగాజారిపోయాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. సీఎం మమతా బెనర్జీ బెంగాల్ ప్రజల ఆశలను వమ్ముచేశారని, అందుకే టీఎంసీ పార్టీ నుంచి నేతలు బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. ఎన్నికలు వచ్చే సమయానికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఆమె ఒక్కరే ఒంటరిగా మిగిలిపోతారని అన్నారు. అనివార్య కారణాల వల్ల బెంగాల్ పర్యటన రద్దు చేసుకున్న అమిత్ షా ఆదివారం హౌరాలో నిర్వహించిన సభలో ప్రజలనుద్దేశిస్తూ ఆన్‌లైన్‌లో మాట్లాడారు. మోడీ సారథ్యంలోని ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంటే దీదీ సర్కారు ఆమె అల్లుడి కోసం నడుస్తున్నదని ఆరోపించారు. మాత, భూమి, ప్రజలంటూ టీఎంసీ నినదిస్తుంది కానీ, వాస్తవంలో ఆ పార్టీ అవినీతి, బెదిరింపులు, దందాలు చేస్తుందని విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్‌లో తమ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని ధీమావ్యక్తం చేశారు.

Tags:    

Similar News