కరోనాతో హోంగార్డు మృతి

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో తొలిసారిగా ఓ కరోనా వారియర్ వైరస్ బారిన పడి మృతి చెందాడు. గురువారం నిజామాబాద్ జనరల్ ఆస్పత్రిలో కరోనాతో చికిత్స పొందుతున్న ఆశ్వక్ అహ్మద్(35) అనే హోంగార్డు పరిస్థితి విషమించి మరణించాడు. ఈయన నిజామాబాద్ రూరల్ పీఎస్‌లో ఆశ్వక్( 160 నెంబర్) హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నెల 12వ తేదీన ఆయనకు పాజిటివ్ రావడంతో జనరల్ ఆస్పత్రిలోని కొవిడ్ వార్డులో చికిత్స పొందుతున్నాడు. అయితే, జిల్లా వ్యాప్తంగా 15 మంది […]

Update: 2020-07-16 03:09 GMT

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో తొలిసారిగా ఓ కరోనా వారియర్ వైరస్ బారిన పడి మృతి చెందాడు. గురువారం నిజామాబాద్ జనరల్ ఆస్పత్రిలో కరోనాతో చికిత్స పొందుతున్న ఆశ్వక్ అహ్మద్(35) అనే హోంగార్డు పరిస్థితి విషమించి మరణించాడు.

ఈయన నిజామాబాద్ రూరల్ పీఎస్‌లో ఆశ్వక్( 160 నెంబర్) హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నెల 12వ తేదీన ఆయనకు పాజిటివ్ రావడంతో జనరల్ ఆస్పత్రిలోని కొవిడ్ వార్డులో చికిత్స పొందుతున్నాడు. అయితే, జిల్లా వ్యాప్తంగా 15 మంది పోలీసులకు కరోనా సోకింది. వారిలో ఒక సీఐ, ఎస్‌ఐ, ఏఎస్‌ఐతో పాటు పలువురు కొవిడ్ బారిన పడిన వారిలో ఉన్నారు. తాజాగా హోంగార్డు మృతితో పోలిస్ శాఖలో వైరస్ వ్యాప్తి నివారణకు జిల్లా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకునే పనిలో పడింది.

Tags:    

Similar News