ట్రాన్స్‌జెండర్‌‌గా మారిన స్టార్ హీరో

దిశ, వెబ్‌డెస్క్: హాలీవుడ్ స్టార్ ఎలియట్ పేజ్ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చాడు. ‘జునో’ సినిమాలో నటనకు గాను ఆస్కార్‌కు నామినేట్ అయిన ఈ స్టార్ హీరో.. ట్రాన్స్‌జెండర్‌గా మారిపోయి ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించిన ఎలెన్ పేజ్.. తనకు నచ్చిన విధంగా స్వీయ ప్రామాణికతను కొనసాగించేందుకు ఇష్టపడుతున్నానని తెలిపాడు. ఈ వార్తను షేర్ చేసుకునేందుకు సంతోషంగా ఉందన్న తను.. అదే సమయంలో ఎదురుదెబ్బల గురించి భయపడుతున్నట్లు చెప్పాడు. ఈ ప్రయాణంలో తనకు సపోర్ట్ […]

Update: 2020-12-02 01:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: హాలీవుడ్ స్టార్ ఎలియట్ పేజ్ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చాడు. ‘జునో’ సినిమాలో నటనకు గాను ఆస్కార్‌కు నామినేట్ అయిన ఈ స్టార్ హీరో.. ట్రాన్స్‌జెండర్‌గా మారిపోయి ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించిన ఎలెన్ పేజ్.. తనకు నచ్చిన విధంగా స్వీయ ప్రామాణికతను కొనసాగించేందుకు ఇష్టపడుతున్నానని తెలిపాడు. ఈ వార్తను షేర్ చేసుకునేందుకు సంతోషంగా ఉందన్న తను.. అదే సమయంలో ఎదురుదెబ్బల గురించి భయపడుతున్నట్లు చెప్పాడు. ఈ ప్రయాణంలో తనకు సపోర్ట్ చేసిన ట్రాన్స్ కమ్యూనిటీకి థాంక్స్ చెప్పాడు. ట్రాన్స్‌గా ఉండటాన్ని ప్రేమిస్తున్నానని.. అలా కనిపించడాన్ని లవ్ చేస్తున్నానని తెలిపిన తను హాలీవుడ్ ట్రాన్స్‌జెండర్ ఫిగర్స్ గ్రూప్‌లో చేరిపోయాడు.

పొలిటికల్ లీడర్స్‌పై ఫైర్..

ఈ సందర్భంగా ట్రాన్స్ హెల్త్ కేర్‌ను నేరపూరితం చేస్తూ వారి ఉనికి హక్కును తిరస్కరిస్తున్న రాజకీయ నాయకులపై విరుచుకుపడ్డారు. ట్రాన్స్ కమ్యూనిటీ పట్ల శత్రుత్వాన్ని కొనసాగించే ప్రజా ప్రముఖులపై మండిపడ్డారు. ఇలాంటి వాళ్ల బెదిరింపుల వల్లే ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఫైర్ అయ్యాడు. దీంతో ఎల్‌జీబీటిక్యూ కమ్యూనిటి ప్రతినిధులు ఎలెన్‌పై ప్రశంసలు కురిపించారు. నిజాలను నిర్భయంగా మాట్లాడటం, సంఘం ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రకాశవంతమైన శక్తిని వెలిగించేందుకు ప్రయత్నిస్తున్న తనకు ధన్యవాదాలు తెలిపారు.

వైఫ్ సపోర్ట్..

తాజాగా నెట్‌ఫ్లిక్స్ సూపర్ హీరో సిరీస్ ‘ద అంబ్రెల్ల అకాడమీ’లో కనిపించిన ఎలెన్ పేజ్ ట్రాన్స్‌జెండర్ స్టేట్‌మెంట్.. హాలీవుడ్ సెలబ్రిటీలు, ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ నుంచి ప్రశంసలు అందుకుంటుండగా, భార్య ఎమ్మ పోర్ట్‌నర్ కూడా తనకు సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టింది. ఎలెన్‌ను చూసి గర్వపడుతున్నానని.. ట్రాన్స్‌జెండర్లు, నాన్ బైనరీ పీపుల్ ప్రపంచానికి బహమతులు అని తెలిపింది. తాము పేషెన్స్, ప్రైవసీ కోరుకుంటున్నట్లు చెప్పింది.

Tags:    

Similar News