కరోనా పోరుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించండి

న్యూఢిల్లీ: కరోనా సంక్షోభ పరిస్థితులతో సాధారణ ప్రజలు ప్రాథమిక ఆరోగ్య సేవలు పొందడానికి ఆపసోపాలు పడుతున్నారని, చికిత్స కోసం భూములు, ఆస్తులు అమ్ముకుంటున్నారని కాంగ్రెస్ రాజ్యసభపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఒకరికి మరొకరు సహాయం చేసుకుంటూ మానవత్వాన్నీ చాటుతున్నారని, కేంద్రం తన బాధ్యతలు నిర్వర్తించడంలో విఫలమైనట్టు ప్రస్తుత పరిస్థితులు తెలియజేస్తున్నాయని పేర్కొంటూ ఈ సంకట పరిస్థితులను ఎదుర్కోవాలంటే తన ఆరు సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని వివరించారు. కరోనాపై పోరాటానికి అన్ని పార్టీల […]

Update: 2021-05-09 10:54 GMT

న్యూఢిల్లీ: కరోనా సంక్షోభ పరిస్థితులతో సాధారణ ప్రజలు ప్రాథమిక ఆరోగ్య సేవలు పొందడానికి ఆపసోపాలు పడుతున్నారని, చికిత్స కోసం భూములు, ఆస్తులు అమ్ముకుంటున్నారని కాంగ్రెస్ రాజ్యసభపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఒకరికి మరొకరు సహాయం చేసుకుంటూ మానవత్వాన్నీ చాటుతున్నారని, కేంద్రం తన బాధ్యతలు నిర్వర్తించడంలో విఫలమైనట్టు ప్రస్తుత పరిస్థితులు తెలియజేస్తున్నాయని పేర్కొంటూ ఈ సంకట పరిస్థితులను ఎదుర్కోవాలంటే తన ఆరు సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని వివరించారు. కరోనాపై పోరాటానికి అన్ని పార్టీల నుంచి అభిప్రాయం తీసుకుని ఐక్యంగా పోరడటానికి ముందు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని సూచించారు. మాజీ పీఎం మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నిర్మాణాత్మక సూచనలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. రెండో సూచనలో ఆయన కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్‌ కోసం బడ్జెట్‌లో కేటాయించిన రూ. 35వేల కోట్లను ప్రస్తావించారు.

ఈ సొమ్ముతో దేశవ్యాప్తంగా ప్రజలకు ఉచితంగా టీకా అందడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. అందుకు భిన్నంగా ప్రైవేటు కంపెనీల దయా దాక్షిణ్యాల మీద రాష్ట్రాలు ఆధారపడేలా నిర్ణయం తీసుకోవడం సరికాదని వివరించారు. అందరినీ ఇమ్యునైజ్ చేయాలనే లక్ష్యంలో భాగంగా 59.5 కోట్ల మంది 18 నుంచి 44 ఏళ్ల వయసున్నవారికీ వేగంగా టీకాలు వేయాలని సూచించారు. మానవతా విలువలను పరిగణించి వ్యా్క్సిన్‌లు(5శాతం), ఆంబులెన్స్ కొనుగోలు(28శాతం), పీపీఈ కిట్(5శాతం లేదా 12శాతం), శానిటైజర్(18శాతం), వెంటిలేటర్(12శాతం), ఆక్సిజన్(12శాతం)లపై జీఎస్టీని మాఫీ చేయాలని నాలుగో సూచనగా పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చిన సహాయాన్ని వీలైనంత వేగంగా రాష్ట్రాలకు హేతుబద్ధంగా పంపిణీ చేయాలని తెలిపారు. వలస కార్మికులు మళ్లీ వెనుదిరుగకుండా ఉపాధి హామీని 200 పనిదినాలకు పెంచి వారికి ఉపాధి కల్పించాలని ఆరో సూచనగా పేర్కొన్నారు. దీని ఈ చట్టం కింద వేతనాలనూ పెంచాలని సూచించారు.

Tags:    

Similar News