హిందుస్తాన్ జింక్ త్రైమాసిక లాభం రూ. 1,339 కోట్లు!

దిశ, సెంట్రల్ డెస్క్: ప్రపంచంలో రెండవ అతిపెద్ద జింక్ ఉత్పత్తిదారు అయిన హిందూస్తాన్ జింక్, 2019-20 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం 14 శాతం క్షీణించి రూ. 6,805 కోట్లని ప్రకటించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ .7,956 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్ ధరలు తగ్గడం, తక్కువ వాల్యూమ్ కారణంగా కంపెనీ ఆదాయం 10.5 శాతం తగ్గి రూ. 20,495 కోట్లకు చేరుకుందని […]

Update: 2020-05-21 09:17 GMT
హిందుస్తాన్ జింక్ త్రైమాసిక లాభం రూ. 1,339 కోట్లు!
  • whatsapp icon

దిశ, సెంట్రల్ డెస్క్: ప్రపంచంలో రెండవ అతిపెద్ద జింక్ ఉత్పత్తిదారు అయిన హిందూస్తాన్ జింక్, 2019-20 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం 14 శాతం క్షీణించి రూ. 6,805 కోట్లని ప్రకటించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ .7,956 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్ ధరలు తగ్గడం, తక్కువ వాల్యూమ్ కారణంగా కంపెనీ ఆదాయం 10.5 శాతం తగ్గి రూ. 20,495 కోట్లకు చేరుకుందని పేర్కొంది. ఈబీఐటీడీఏ (వడ్డీ, పన్నులు, తరుగుదల, రుణ విమోచనకు ముందు ఆదాయాలు) గత ఆర్థిక సంవత్సరంలో 18 శాతం తగ్గి రూ. 8,849 కోట్లకు చేరుకున్నాయి.

మార్చి 31, 2020తో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో హిందుస్తాన్ జింక్ నికర లాభంలో 33.4 శాతం క్షీణించి రూ. 1,339 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ. 2,012 కోట్లుగా ఉంది. జనవరి-మార్చి త్రైమాసికంలో సంస్థ మొత్తం ఆదాయం రూ. 4,861 కోట్లకు తగ్గింది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో రూ .6,030 కోట్లు. మే 12న హిందుస్తాన్ జింక్ బోర్డు ఈక్విటీ షేరుకు రూ .16.50 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.

కొవిడ్-19 వంటి క్లిష్ట సమయాల్లో తన సిబ్బందిని సురక్షితంగా ఉంచడానికి అనుకూలమైన విధానాన్ని తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. మార్చి 22 నుండి కంపెనీ కార్యకలాపాలు ఆగిపోయాయి. చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచి పని చేశారు. సంరక్షణ, నిర్వహణతో సహా ఉత్పత్తి ఆస్తులను సురక్షితంగా ఉంచేందుకు విధిగా కొంతమంది ఉద్యోగులను మినహాయించామని కంపెనీ వెల్లడించింది. హిందుస్తాన్ జింక్ ఏప్రిల్ 8 నుండి క్రమంగా కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది. గనులు, కర్మాగారాలను మరికొన్ని వారాల్లో ప్రారంభించనున్నట్టు పేర్కొంది.

Tags:    

Similar News