తగ్గిన హిందాల్‌కో ఆదాయం!
ఆదిత్య బిర్లా గ్రూప్ అనుబంధ సంస్థ హిందాల్‌కో ఇండస్ట్రీస్ 2019 డిసెంబర్‌తో ముగిసిన మూడవ త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం ఏడాదికి రూ. 1,062 కోట్లతో 24 శాతం క్షీణించిందని ప్రకటించింది. అల్యూమినియం, రాగి తయారీలో అగ్రగామి అయిన ఈ సంస్థ ఇదే త్రైమాసికంలో గతేడాది రూ. 1,394 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో హిందాల్‌కో ఏకీకృత ఆదాయం రూ. 29,197 కోట్లతో 12.09 శాతం తగ్గింది. అతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో […]
ఆదిత్య బిర్లా గ్రూప్ అనుబంధ సంస్థ హిందాల్‌కో ఇండస్ట్రీస్ 2019 డిసెంబర్‌తో ముగిసిన మూడవ త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం ఏడాదికి రూ. 1,062 కోట్లతో 24 శాతం క్షీణించిందని ప్రకటించింది. అల్యూమినియం, రాగి తయారీలో అగ్రగామి అయిన ఈ సంస్థ ఇదే త్రైమాసికంలో గతేడాది రూ. 1,394 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో హిందాల్‌కో ఏకీకృత ఆదాయం రూ. 29,197 కోట్లతో 12.09 శాతం తగ్గింది. అతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 33,213 కోట్లుగా నమోదు చేసింది. ఆర్థిక పరిస్థితులు తగ్గినప్పటికీ బలమైన పనితీరు, తక్కువ ఖర్చులు, దేశీయ వ్యాపారంలో స్థిరమైన కార్యకలాపాల నేపథ్యంలో సంస్థ స్థిరమైన త్రైమాసిక ఫలితాలను ఇచ్చిందని హిందాల్‌కో ఇండస్ట్రీస్ పేర్కొంది. మొత్తం వడ్డీ, పన్ను, తరుగుదల, రుణ విమోచన ముందు ఆదాయాలు 2019-20 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 3,676 కోట్లు. గతేడాది రూ. 4,080 కోట్లతో పోలిస్తే 10 శాతం తగ్గుదల నమోదైంది. వస్తువులు, పన్నుల ఏకీకృత లాభం గతేడాది రూ. 1,931 కోట్లుగా ఉండగా, 2019-20 ఆర్థిక సంవత్సరం రూ. 1,487 కోట్లతో 23 శాతం తరుగుదలను నమోదు చేసింది.
సెగ్మెంట్‌ల వారీగా చూస్తే, అల్యూమినియం సెగ్మెంట్ నుంచి వచ్చే ఆదాయం 9 శాతం తగ్గి రూ. 5,467 కోట్లుగా ఉంది. ఇది గతేడాది రూ. 6,019 కోట్లుగా నమోదైంది. రాగి వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 4,774 కోట్లు ఉండగా, గతేడాది రూ. 5,943 కోట్లుగా ఉండేది.
గడిచిన కొన్నేళ్లుగా ప్లాంట్ కార్యకలాపాలను మెరుగుపరచడంపై హిందాల్‌కో నిరంతరం కృషి చేస్తోందని, ఈ సామర్థ్యాలే బలహీనమైన మార్కెట్లో స్థిరంగా ఉండటానికి సహాయపడ్డాయని హిందాల్‌కో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ చెప్పారు. స్టాక్‌మార్కెట్‌లో మూడో త్రైమాసిక ఫలితాల అనంతరం హిందాల్‌కో ఇండస్ట్రీస్ షేర్ ధర 0.15 శాతం తగ్గి రూ. 193.25 వద్ద ట్రేడవుతోంది.