నది మధ్యలో విరిగిపడిన కొండచరియలు.. టెన్షన్‌లో 11 గ్రామాల ప్రజలు(వీడియో)

దిశ, వెబ్‌డెస్క్ : హిమాచల్ ప్రదేశ్‌లో ప్రకృతి బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా లాహౌల్ స్పీతిలో భారీ కొండ విరిగిపడింది. విరిగిపడిన కొండ చరియలు.. చంద్రభాగా నది మధ్యలో పడ్డాయి. దీంతో చంద్రభాగా నదీ ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది. ఈ కారణంగా చుట్టుపక్కల ఉన్న 11 గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేశారు. కొండచరియలు విరిగిపడుతున్న […]

Update: 2021-08-13 11:09 GMT

దిశ, వెబ్‌డెస్క్ : హిమాచల్ ప్రదేశ్‌లో ప్రకృతి బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా లాహౌల్ స్పీతిలో భారీ కొండ విరిగిపడింది. విరిగిపడిన కొండ చరియలు.. చంద్రభాగా నది మధ్యలో పడ్డాయి. దీంతో చంద్రభాగా నదీ ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది.

ఈ కారణంగా చుట్టుపక్కల ఉన్న 11 గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేశారు. కొండచరియలు విరిగిపడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరో వైపు హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నోర్ ప్రాంతంలో రోడ్డుపై కొండ చరియలు విరిగిపడుతుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Tags:    

Similar News