కేరళను వణికిస్తున్న వర్షాలు.. శబరిమలలో హై అలర్ట్

దిశ, వెబ్‌డెస్క్: కేరళ రాష్ట్రాన్ని అకాల వర్షాలు వణికిస్తున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ కారణంగా కేరళలోని పలు జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నట్టు ఐఎండీ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పతనంతిట్ట జిల్లాలో గత 12 గంటల్లో 10సెమీల వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. పలుచోట్లు ఉరుములు, పిడుగులతో కూడా వర్షం పడుతోందన్నారు. జిల్లాలోని మలయప్పుజ ప్రాంతం సమీపంలో గల ముస్లియార్ కాలేజీ వద్ద కొండచరియలు విరిగిపడినట్టు సమాచారం. ఈ ప్రాంతంలో పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. […]

Update: 2021-10-16 06:22 GMT
కేరళను వణికిస్తున్న వర్షాలు.. శబరిమలలో హై అలర్ట్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: కేరళ రాష్ట్రాన్ని అకాల వర్షాలు వణికిస్తున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ కారణంగా కేరళలోని పలు జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నట్టు ఐఎండీ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పతనంతిట్ట జిల్లాలో గత 12 గంటల్లో 10సెమీల వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు.

పలుచోట్లు ఉరుములు, పిడుగులతో కూడా వర్షం పడుతోందన్నారు. జిల్లాలోని మలయప్పుజ ప్రాంతం సమీపంలో గల ముస్లియార్ కాలేజీ వద్ద కొండచరియలు విరిగిపడినట్టు సమాచారం. ఈ ప్రాంతంలో పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇకపోతే కోజికోడ్‌లో కుండపోత వర్షం కురుస్తుండటంతో శబరిమలకు వెళ్లే దారులన్నీ జలమయం అయ్యాయి. ముండకయమ్, కుట్టిక్కనమ్ వెళ్లే దారుల్లో కొండచరియలు విరిగిపడినట్టు తెలుస్తోంది. అయితే, కుమాలి రోడ్డు గుండా శబరిమల వచ్చే అయ్యప్ప భక్తులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

Tags:    

Similar News