కరోనా పరీక్షలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణలో కరోనా పరీక్షలు జరుగుతున్న తీరుపై రాష్ట్ర హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ పరీక్షలు ఎందుకు చేస్తున్నారని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తెలంగాణలో ప్రత్యేక రాజ్యాంగమేమైనా అమలులో ఉందా అని తీవ్రస్థాయిలో ప్రభుత్వాన్ని నిలదీసింది. కోర్టు స్పష్టంగా ఆదేశాలిచ్చినా సూర్యాపేటలో టెస్టులు చేయకపోవడంపై బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి సంకినేని వరుణ్ రావు వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్, జస్టిస్ బి. […]

Update: 2020-05-26 06:11 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణలో కరోనా పరీక్షలు జరుగుతున్న తీరుపై రాష్ట్ర హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ పరీక్షలు ఎందుకు చేస్తున్నారని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తెలంగాణలో ప్రత్యేక రాజ్యాంగమేమైనా అమలులో ఉందా అని తీవ్రస్థాయిలో ప్రభుత్వాన్ని నిలదీసింది. కోర్టు స్పష్టంగా ఆదేశాలిచ్చినా సూర్యాపేటలో టెస్టులు చేయకపోవడంపై బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి సంకినేని వరుణ్ రావు వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్, జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి‌తో కూడిన ధర్మాసనం మంగళవారం మూడు గంటల పాటు విచారించింది. సూర్యాపేటలో ఏప్రిల్ 24 తర్వాత కేవలం 35 టెస్టులు మాత్రమే చేసి రెడ్‌జోన్ నుంచి ఆ ప్రాంతాన్ని గ్రీన్‌జోన్‌గా మార్చి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతారా అని సీరియస్ అయింది. మార్చి 11 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో చేసిన కరోనా పరీక్షల వివరాలన్నిటిననీ సమర్పించాలని ఆదేశించింది. జూన్ 4వ తేదీలోగా ఈ అంశంపై తమకు నివేదిక అందజేయాలని కోరింది. మృతదేహాలకు పరీక్షలు అవసరం లేదన్న ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టి వేసింది. కరోనా పరీక్షలపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రాసిన రెండు లేఖలను సమర్పించాలని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీల్లో ఎంత మందికి పరీక్షలు చేశారో తెలపాలని ఆదేశించింది. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ఎంతమంది వైద్య సిబ్బందికి ఎన్ని రక్షణ కిట్లు ఇచ్చారో వివరాలివ్వాలని కోర్టు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరింది.

Tags:    

Similar News