సిట్ దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు

దిశ, వెబ్‎డెస్క్: డ్రగ్స్‌ కేసులో సిట్‌ దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డ్రగ్స్‌ కేసుపై 2017లో కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారించింది. ఈ కేసులో అంతర్జాతీయ ముఠాల ప్రమేయం ఉన్నందున రేవంత్‌ రెడ్డి పిటిషన్‎లో పేర్కొన్నారు. డ్రగ్స్ కేసును సీబీఐ, ఈడీ, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వంటి కేంద్ర సంస్థలకు కేసును అప్పగించాలంటూ రేవంత్ రెడ్డి కోరారు. ఈ కేసు దర్యాప్తునకు ఈడీ, […]

Update: 2020-11-12 02:34 GMT

దిశ, వెబ్‎డెస్క్: డ్రగ్స్‌ కేసులో సిట్‌ దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డ్రగ్స్‌ కేసుపై 2017లో కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారించింది. ఈ కేసులో అంతర్జాతీయ ముఠాల ప్రమేయం ఉన్నందున రేవంత్‌ రెడ్డి పిటిషన్‎లో పేర్కొన్నారు. డ్రగ్స్ కేసును సీబీఐ, ఈడీ, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వంటి కేంద్ర సంస్థలకు కేసును అప్పగించాలంటూ రేవంత్ రెడ్డి కోరారు. ఈ కేసు దర్యాప్తునకు ఈడీ, ఎన్‌సీబీ సిద్ధంగా ఉందని పిటిషనర్‌ తరపు న్యాయవాది తెలిపారు. సిట్‌ దర్యాప్తు తాజా పరిస్థితిపై డిసెంబర్‌ 10లోపు తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Tags:    

Similar News