స్టేటస్ కో పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ పరిపాలన వికేంద్రీకరణ చట్టంపై స్టేటస్ కో పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 27 వరకు పొడిగిస్తూ ఆదేశాల్లో పేర్కొన్నది. స్టేటస్ కో తీసివేయాలని విచారణ సమయంలో ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ఇందుకో హైకోర్టు నిరాకరించింది. ఆన్ లైన్ లో ఇబ్బందులున్నాయని.. ఈ నేపథ్యంలో హైకోర్టులో నేరుగా విచారణ జరపాలని పలువురు న్యాయవాదులు కోరారు. కరోనా కారణంగా నేరుగా హైకోర్టులో వాదనలు వినిపించలేనని, ఢిల్లీ నుంచి వాదనలు […]
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ పరిపాలన వికేంద్రీకరణ చట్టంపై స్టేటస్ కో పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 27 వరకు పొడిగిస్తూ ఆదేశాల్లో పేర్కొన్నది. స్టేటస్ కో తీసివేయాలని విచారణ సమయంలో ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ఇందుకో హైకోర్టు నిరాకరించింది. ఆన్ లైన్ లో ఇబ్బందులున్నాయని.. ఈ నేపథ్యంలో హైకోర్టులో నేరుగా విచారణ జరపాలని పలువురు న్యాయవాదులు కోరారు. కరోనా కారణంగా నేరుగా హైకోర్టులో వాదనలు వినిపించలేనని, ఢిల్లీ నుంచి వాదనలు వినిపిస్తామని ప్రభుత్వ లాయర్ రాకేశ్ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు పేర్కొన్నట్లు సమాచారం.