రైతు బంధు వివరాలు సమర్పించండి
దిశ, న్యూస్ బ్యూరో: గతేడాది ఖరీఫ్, రబీ సీజన్‌లకు సంబంధించి రైతుబంధు పథకం ద్వారా లబ్ధిదారులకు జరిగిన చెల్లింపు వివరాలను సమర్పించాల్సిందిగా ప్రభుత్వానికి హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. వరంగల్ జిల్లాకు చెందిన ప్రమోద్ కుమార్ అనే రైతు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు జస్టిస్ విజయసేన్ రెడ్డి డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. తొలుత ఇది రిట్ పిటిషన్ అయినప్పటికీ గతంలో సింగిల్ జడ్జి బెంచ్‌గా ఉన్న జస్టిస్ సి.కోదండరామ్ […]
దిశ, న్యూస్ బ్యూరో: గతేడాది ఖరీఫ్, రబీ సీజన్‌లకు సంబంధించి రైతుబంధు పథకం ద్వారా లబ్ధిదారులకు జరిగిన చెల్లింపు వివరాలను సమర్పించాల్సిందిగా ప్రభుత్వానికి హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. వరంగల్ జిల్లాకు చెందిన ప్రమోద్ కుమార్ అనే రైతు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు జస్టిస్ విజయసేన్ రెడ్డి డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. తొలుత ఇది రిట్ పిటిషన్ అయినప్పటికీ గతంలో సింగిల్ జడ్జి బెంచ్‌గా ఉన్న జస్టిస్ సి.కోదండరామ్ విచారణకు స్వీకరించి.. యావత్తు రాష్ట్ర రైతాంగానికి సంబంధించిన అంశంగా పరిగణనలోకి తీసుకుని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా మార్చారు. ఈ పిటిషన్ను ద్విసభ్య బెంచ్ సోమవారం విచారించి రైతుబంధు పథకం అమలులోకి వచ్చిన తర్వాత మూడవ, నాల్గవ విడతలకు ప్రభుత్వం నుంచి రైతులకు పంపిణీ అయిన వివరాలను కోర్టుకు సమర్పించాలని అడ్వొకేట్ జనరల్‌ను ఆదేశించింది. అర్హులైన లబ్ధిదారులందరికీ రైతుబంధు సాయాన్ని ఎందుకు అందించలేకపోయిందో వివరించాలని స్పష్టం చేసింది.
రైతుబంధు వెబ్‌సైట్‌లో సైతం లబ్ధిదారుల పేర్లు లేవని, ఎవరికి రైతుబంధు సాయం అందిందో, ఇంకా ఎవరికి అందాల్సి ఉన్నదో వివరాలు తెలుసుకునే వీలు లేకుండా పోయిందని పిటిషనర్ పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదిస్తే తమకు అందిన వివరాల్లోగానీ, వెబ్‌సైట్‌లోగానీ ఏ లబ్ధిదారుల పేర్లు ఉన్నాయో వారికి మాత్రమే రైతుబంధు సాయాన్ని అందించామంటూ సమాధానం ఇస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ఆ జాబితాలో పేర్లు లేని రైతులకు సాయం ఇవ్వడం కుదరదని అంటున్నారని, 2019 ఖరీఫ్, రబీ సీజన్‌లకు ఆ జాబితా ప్రకారమే చెల్లింపులు చేసినట్లు వివరించారని పిటిషనర్ వివరించారు. పిటిషనర్ లేవనెత్తిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ రెండు సీజన్‌లలో రైతులకు ఈ పథకం కింద ఇచ్చిన వివరాలను సమర్పించాలని ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.