అయ్యన్నకు ఊరట.. అరెస్టుపై స్టే

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకి హైకోర్టు ఊరటనిచ్చింది. నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణిని అసభ్య పదజాలంతో దూషించాడన్న ఆరోపణలపై ఏ క్షణమైన ఆయనను అరెస్టు చేయవచ్చంటూ పుకార్లు షికార్లు చేశాయి. దీంతో ఆందోళన చెందిన అయ్యన్నపాత్రులు హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం ఆయనను అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు […]

Update: 2020-06-22 05:20 GMT
అయ్యన్నకు ఊరట.. అరెస్టుపై స్టే
  • whatsapp icon

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకి హైకోర్టు ఊరటనిచ్చింది. నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణిని అసభ్య పదజాలంతో దూషించాడన్న ఆరోపణలపై ఏ క్షణమైన ఆయనను అరెస్టు చేయవచ్చంటూ పుకార్లు షికార్లు చేశాయి. దీంతో ఆందోళన చెందిన అయ్యన్నపాత్రులు హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం ఆయనను అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Tags:    

Similar News