రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పీలెట్ అథారిటీ ఏర్పాటుపై హైకోర్టు విచారణ

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పీలెట్ అథారిటీ ఏర్పాటుపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. అప్పీలెట్ అథారిటీ ఏర్పాటుకు 4 వారాల సమయాన్ని ప్రభుత్వం కోరగా, రెండ్రోజుల్లో ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచించింది. కనీసం వారం రోజుల సమయం ఇవ్వాలని ఏజీ ప్రసాద్ కోరగా, వారంలో గెజిట్ జారీ చేసి సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది.

Update: 2021-07-07 11:31 GMT

Tags:    

Similar News