తెలంగాణలో అడుగుపెట్టిన హిడ్మా..? అందుకేనా..
దిశ ప్రతినిధి, వరంగల్ : మావోయిస్టు పార్టీ కీలక నేత, దాడుల వ్యూహకర్త మాడ్వి హిడ్మా తెలంగాణలోకి ప్రవేశించినట్లుగా పోలీస్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న హిడ్మాకు వైద్య పరీక్షలు చేయించేందుకు మావోయిస్టులు అతడిని తెలంగాణలోకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా నిఘా వర్గాల నుంచి పోలీసులకు సమాచారం అందినట్లుగా తెలుస్తోంది. ఏటూరునాగారం డివిజన్ ఏజెన్సీ మండలాల్లో హిడ్మా ప్రస్తుతం తలదాచుకున్నట్లుగా సమాచారం. ఈనేపథ్యంలోనే ఏటూరునాగారంతో పాటు గోదావరి తీర ప్రాంతమంతా కూడా హై అలెర్ట్ […]
దిశ ప్రతినిధి, వరంగల్ : మావోయిస్టు పార్టీ కీలక నేత, దాడుల వ్యూహకర్త మాడ్వి హిడ్మా తెలంగాణలోకి ప్రవేశించినట్లుగా పోలీస్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న హిడ్మాకు వైద్య పరీక్షలు చేయించేందుకు మావోయిస్టులు అతడిని తెలంగాణలోకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా నిఘా వర్గాల నుంచి పోలీసులకు సమాచారం అందినట్లుగా తెలుస్తోంది. ఏటూరునాగారం డివిజన్ ఏజెన్సీ మండలాల్లో హిడ్మా ప్రస్తుతం తలదాచుకున్నట్లుగా సమాచారం.
ఈనేపథ్యంలోనే ఏటూరునాగారంతో పాటు గోదావరి తీర ప్రాంతమంతా కూడా హై అలెర్ట్ ప్రకటించారు. జోరుగా వాహన తనిఖీలు జరుపుతున్నారు. ఏజెన్సీ మండలాలపై డేగ కన్ను కొనసాగుతోంది. గూడెంలను, తండాలను జల్లెడ పడుతున్నారు. కొత్త వ్యక్తుల రాకపై ఎప్పటికప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. జయశంకర్-భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏజెన్సీలోని ఆస్పత్రులను జల్లెడపడుతున్నారు. వాహనాలను తనిఖీ చేస్తున్నారు. గత మూడు రోజుల నుంచి జిల్లాలో పోలీసులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. చత్తీస్ ఘడ్ ఫస్ట్ నుండి భూపాల్ పల్లి జిల్లా లోకి మావోయిస్టులు భారీగా చేరినట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు మావోయిస్టు టార్గెట్గా ఉన్నవారిని హెచ్చరికలు చేసినట్లు తెలిసింది.
హిడ్మాపై విష ప్రయోగం జరిగిందా..?
ఆర్కేపై విష ప్రయోగం జరిగిందని మావోయిస్టు సానుభూతిపరులు ఇటీవల ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. ఆర్కే మృతిపై అటు మావోయిస్టు పార్టీ పెద్దల్లో కూడా అనుమానాలున్నట్లుగా తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే తనపై కూడా విష ప్రయోగం జరిగి ఉంటుందని హిడ్మా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే వైద్య పరీక్షల నిమిత్తం తెలంగాణకు వచ్చినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.