నలుగురితో డేటింగ్.. మూడోపెళ్లి పెటాకులు.. మరో పెళ్లికి సిగ్నల్

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవలే మూడో పెళ్లితో వార్తల్లో నిలిచిన హీరోయిన్‌.. అప్పుడే నాలుగో పెళ్లికి సిద్ధమైందన్న వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సినిమాల్లో నటనకంటే వ్యక్తిగత జీవితంలో ఎత్తుపల్లాలతోనే ఇమేజ్ తెచ్చుకున్న సదరు హీరోయిన్ మూడో పెళ్లి, ఆర్నెళ్లు తిరక్కుండానే పెటాకులైందన్న వార్త విన్న ఇండస్ట్రీ వర్గాలు ముక్కున వేలేసుకుంటున్నాయి. తన 20వ ఏట మొదటి పెళ్లి చేసుకున్న హీరోయిన్.. 2020లో 40 ఏళ్ల వయస్సులో నాలుగో పెళ్లికి రెడీ అయిపోయింది. భర్తలతో విభేదాల […]

Update: 2020-12-19 05:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవలే మూడో పెళ్లితో వార్తల్లో నిలిచిన హీరోయిన్‌.. అప్పుడే నాలుగో పెళ్లికి సిద్ధమైందన్న వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సినిమాల్లో నటనకంటే వ్యక్తిగత జీవితంలో ఎత్తుపల్లాలతోనే ఇమేజ్ తెచ్చుకున్న సదరు హీరోయిన్ మూడో పెళ్లి, ఆర్నెళ్లు తిరక్కుండానే పెటాకులైందన్న వార్త విన్న ఇండస్ట్రీ వర్గాలు ముక్కున వేలేసుకుంటున్నాయి. తన 20వ ఏట మొదటి పెళ్లి చేసుకున్న హీరోయిన్.. 2020లో 40 ఏళ్ల వయస్సులో నాలుగో పెళ్లికి రెడీ అయిపోయింది. భర్తలతో విభేదాల కారణంగా ఇప్పటికే ముగ్గురికి గుడ్‌బై చెప్పిన నటి.. మళ్లీ ప్రేమలో పడ్డానని ఇన్‌‌స్ట్రా‌గ్రామ్‌లో మెసేజ్ పెట్టడం చర్చనీయాంగా మారింది. నిత్యకల్యాణాలతో లైమ్ లైట్‌లో కొనసాగుతున్న ఆ హీరోయిన్ ఎవరో కాదు.. నటుడు విజయ్ కుమార్, మంజుల దంపతుల కూతురు వనితా విజయ్‌కుమార్.

తమిళ్, మళయాళం, తెలుగు ఇండస్ట్రీల్లో నటిస్తున్న సమయంలోనే 2000 సంవత్సరంలో నటుడు ఆకాశ్‌ను పెళ్లి చేసుకున్న వనిత.. ముగ్గురు పిల్లలు పుట్టాక భర్తతో విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకుంది. మళ్లీ 2007లో ఓ పారిశ్రామిక వేత్తను వివాహం చేసుకొని 2012లో డైవర్స్‌ ఇచ్చింది. ఆ తర్వాత కొరియోగ్రాఫర్‌ రాబర్ట్‌తో నాలుగేళ్లు డేటింగ్‌ చేసి 2017లో అతనికి కూడా రాం రాం చెప్పింది. ఇక 2017 నుంచి సినీ ఇండస్ట్రీకి చెందిన పీటర్‌ పాల్‌తో ఫ్రెండ్‌‌షిప్‌ చేసిన వనిత.. 2020 జూన్ చివరివారంలో అతన్ని మ్యారేజ్ చేసుకుంది. హనీమూన్ వెళ్లిన సమయంలో అతనితో గొడవపడి, అప్పటి నుంచి దూరంగా ఉంటోంది. అయితే ఈ సమయంలోనే పీటర్ పాల్ మొదటి భార్య ఎలిసాబెత్‌.. తనకు విడాకులు ఇవ్వకుండా వనితను పెళ్లి చేసుకున్నాడని పోలీసులకు కంప్లెంట్ ఇవ్వడంతో వీరిద్దరూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.

అయితే నవంబర్‌‌లోనే పీటర్.. తన భార్య ఎలిసాబెత్‌ దగ్గరకు వెళ్లిపోవడంతో.. మళ్లీ పిల్లలతో కలిసి ఒంటరి జీవితం గడుపుతున్న వనిత.. ఇప్పుడు మరొకరితో లవ్‌లో పడ్డట్లు తెలుస్తోంది. రెండ్రోజుల క్రితం ఇన్‌స్ట్రాగ్రామ్, ట్విట్టర్‌లో ‘ఇన్ లవ్ ఎగైన్, ఆర్ యూ హ్యాపీ నౌ’ అంటూ ఉమా రియాజ్‌ ఖాన్‌ పేరు మెన్షన్ చేసింది. దీంతో ఆమెను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. నలుగురితో డేటింగ్ చేసి మూడు పెళ్లి చేసుకున్నా పెటాకులే అయ్యాయని.. అసలు హీరోయిన్ వనితకు పెళ్లిళ్లు అచ్చిరావడం లేదని కామెంట్లు పెడుతున్నారు. నాలుగో పెళ్లి అయినా కలిసి రావాలని ఆమె ఫ్యాన్స్‌ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Tags:    

Similar News