ముచ్చటగా మూడోసారి ‘మూడుముళ్లు’
– ఈ నెల 27న హీరోయిన్ వనిత పెళ్లి నటుడు విజయ్ కుమార్, నటి మంజుల కూతురు అయిన హీరోయిన్ ‘వనిత విజయ్ కుమార్’ ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ నెల 27న చెన్నైలోని తన నివాసం ప్రెస్టీజ్ బెల్లా విస్టాలో పీటర్ పాల్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను మీడియాకు అందించారు. 1995లో హీరో విజయ్ సినిమా చంద్రలేఖతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వనిత.. ఈ మధ్య బిగ్ బాస్ […]
– ఈ నెల 27న హీరోయిన్ వనిత పెళ్లి
నటుడు విజయ్ కుమార్, నటి మంజుల కూతురు అయిన హీరోయిన్ ‘వనిత విజయ్ కుమార్’ ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ నెల 27న చెన్నైలోని తన నివాసం ప్రెస్టీజ్ బెల్లా విస్టాలో పీటర్ పాల్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను మీడియాకు అందించారు.
1995లో హీరో విజయ్ సినిమా చంద్రలేఖతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వనిత.. ఈ మధ్య బిగ్ బాస్ షోతో మళ్లీ లైమ్ లైట్‌లోకి వచ్చారు. ఇప్పుడొక రియాలిటీ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తున్న ఆమె.. ముందుగా 2000 సంవత్సరంలో ఆకాష్‌ను పెళ్లి చేసుకుంది. కానీ తనతో విభేదాల కారణంగా 2007లో విడిపోయింది. కాగా వీరిద్దరికీ ఒక బాబు, పాప ఉన్నారు. ఆ తర్వాత ఏపీకి చెందిన బిజినెస్‌మ్యాన్ ఆనంద్ రాజ్‌ను 2007లో మ్యారేజ్ చేసుకున్న వనిత.. 2010లో తమ బంధానికి బ్రేక్ చెప్పేసింది.
కాగా ఇప్పుడు ముచ్చటగా మూడోసారి విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్ పీటర్ పాల్‌ను పెళ్లి చేసుకోబోతుంది. ఒక బిగ్ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ టైమ్‌లో ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారి పెళ్లి పీటల వరకు వచ్చిందని తెలిపింది. ‘ప్రతీ అమ్మాయి జీవితంలో తనను గొప్పగా చూసుకునే భర్తను పొందాలని కోరుకుంటుంది.. పాల్ నా కలను నిజం చేసే వ్యక్తి అని.. అందుకే తనతో ఏడడుగులు వేయాలి అనుకున్నట్లు’ చెప్పింది. తన ప్రతీ అడుగులో అండగా నిలుస్తూ వస్తున్న అభిమానులు, కుటుంబ సభ్యులు, మిత్రులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది.