శవం ముందు చిందేసిన నటి.. ఓ రేంజ్ లో ఆడుకుంటున్న నెటిజన్లు

దిశ, వెబ్‌డెస్క్: షూటింగ్ అంటే ఎప్పుడు హడావిడిగా ఉంటుంది. ఇక ఒక్కసారి సెట్లో అడుగుపెట్టాకా మళ్లీ  ప్యాకప్ చెప్పేవరకు అన్ని అక్కడనే.. కొంతమంది హీరోయిన్లు సెట్లో ఖాళీగా ఉన్న సమయంలో రీల్స్ చేస్తూ వారి సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే హీరోయిన్ నందిని రాయ్ పోస్ట్ చేసిన ఒక రీల్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారడమే కాకుండా విమర్శలను కూడా అందుకుంటుంది. ఇంతకీ అంతగా విమర్శలు చేయడానికి ఆ వీడియో లో […]

Update: 2021-06-27 02:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: షూటింగ్ అంటే ఎప్పుడు హడావిడిగా ఉంటుంది. ఇక ఒక్కసారి సెట్లో అడుగుపెట్టాకా మళ్లీ ప్యాకప్ చెప్పేవరకు అన్ని అక్కడనే.. కొంతమంది హీరోయిన్లు సెట్లో ఖాళీగా ఉన్న సమయంలో రీల్స్ చేస్తూ వారి సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే హీరోయిన్ నందిని రాయ్ పోస్ట్ చేసిన ఒక రీల్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారడమే కాకుండా విమర్శలను కూడా అందుకుంటుంది. ఇంతకీ అంతగా విమర్శలు చేయడానికి ఆ వీడియో లో ఏముంది అంటే నందిని రాయ్ ఒక శవం ముందు డాన్స్ చేయడమే.. ఇంతకీ విషయమేంటంటే..

నందిని రాయ్ ‘ఇన్‌ ద నేమ్‌ ఆఫ్‌ గాడ్‌’ వెబ్‌ సిరీస్‌లో నటించిన విషయం తెలిసిందే. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ సీరీస్ ఇటీవల ఆహా ఓటిటీ లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది. ఈ సిరీస్‌ షూటింగ్‌ మధ్యలో చేసిన అల్లరి పనులకు సాంపుల్‌గా నందిని ఓ వీడియోను షేర్‌ చేసింది. ధనుష్ నటించిన ‘జగమే తంత్రం’ సినిమాలోని రకిట రకిట పాటకు వీర లెవల్లో స్టెప్పులేసింది. పాత చీర కట్టుకొని, డీ గ్లామరేజ్డ్ గా కనిపించింది. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ఆమె విమర్శల పాలివ్వడానికి ప్రధాన కారణం.. ఆమె డాన్స్ చేసిన ప్లేస్. సెట్ లో ఒక ఓ శవం ముందు డ్యాన్స్‌ చేసింది! అయితే అక్కడ నిజంగా ఎవరూ చనిపోలేదు, కేవలం అది షూటింగ్‌లో భాగంగా వేసిన సెట్‌.

అందులో పోసాని ఫోటో ఉండడంతో సిరీస్ లో పోసాని చనిపోయినప్పుడు జరిగిన సీన్ తర్వాత నందిని ఈ అల్లరి పని చేసినట్లు కనిపిస్తుంది. అయితే ఈ వీడియా పై పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. డెడ్‌ బాడీ ముందు డ్యాన్స్‌ ఏంటి?, అది కేవలం సెట్టే కావచ్చు, అయినా అక్కడ అలా డ్యాన్స్‌ చేయడం ఏమీ బాగోలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News