విజయ్ సైకిల్ స్టంట్ బిల్డప్ కోసమే… నిందలు వేయొద్దంటున్న ఫ్యాన్స్

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో ఈరోజు పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతేకాకుండా పోలింగ్‌ కేంద్రంలో అభిమానులతో సెల్ఫీలకు పోజులిచ్చారు. ఇక హీరో విజయ్ సైకిల్ పై వెళ్లి ఓటు వేయడం తమిళనాట చర్చనీయాంశమయ్యింది. ప్రస్తుతం ఆయన సైకిల్‌పై వచ్చిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. విజయ్ బిల్డప్ కోసం సైకిల్ మీద వచ్చాడని కొందరు … పెట్రోల్ ధరలు పెరగడంతో బీజేపీ పై నిరసన […]

Update: 2021-04-06 06:02 GMT
విజయ్ సైకిల్ స్టంట్ బిల్డప్ కోసమే… నిందలు వేయొద్దంటున్న ఫ్యాన్స్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో ఈరోజు పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతేకాకుండా పోలింగ్‌ కేంద్రంలో అభిమానులతో సెల్ఫీలకు పోజులిచ్చారు. ఇక హీరో విజయ్ సైకిల్ పై వెళ్లి ఓటు వేయడం తమిళనాట చర్చనీయాంశమయ్యింది. ప్రస్తుతం ఆయన సైకిల్‌పై వచ్చిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. విజయ్ బిల్డప్ కోసం సైకిల్ మీద వచ్చాడని కొందరు … పెట్రోల్ ధరలు పెరగడంతో బీజేపీ పై నిరసన తెలుపుతూ సైకిల్ పై వచ్చాడని మరికొందరు ట్రోల్స్ చేస్తున్నారు.

అయితే విజయ్ సైకిల్ పై రావడానికి కారణం ఉందని విజయ్ అభిమానులు ట్విట్టర్ వేదికగా తెలుపుతున్నారు. ఓటు వేసే పోలింగ్ బూత్ విజయ్ ఇంటి వెనక భాగంలోనే ఉందని, అందుకే ఆయన సైకిల్ మీద వచ్చారని, అంతేకాకుండా అంత చిన్న దారిలో కారు పట్టకపోవడం వలనే ఈ విధంగా రావాల్సి వచ్చిందని అభిమానులు క్లారిటీ ఇచ్చారు. కారణం తెలుసుకోకుండా నిందలు వేయొద్దంటూ తళపతి అభిమానులు కోరుతున్నారు.

Tags:    

Similar News