లవ్‌డ్ యువర్ వాయిస్ సత్యదేవ్ : సూర్య

దిశ, వెబ్ డెస్క్: ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సూర్య నటన, అపర్ణ బాలమురళి పాత్రలో ఒదిగిపోయిన తీరును అభినందిస్తున్నారు. వీరితోపాటు సూర్యకు తెలుగులో డబ్బింగ్ చెప్పిన వ్యక్తి గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు అతనే హీరో సత్య‌దేవ్. సూర్యకు ఇంతకుముందు కార్తీ కొన్ని సినిమాలకు డబ్బింగ్ చెప్పాడు. కానీ, ఇప్పుడు సత్య2దేవ్ తన గాత్రాన్ని దానం చేయగా అభినందనలు అందుకుంటున్నాడు. ఏకంగా హీరో సూర్యనే సత్యదేవ్ గురించి ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. […]

Update: 2020-11-13 05:09 GMT

దిశ, వెబ్ డెస్క్: ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సూర్య నటన, అపర్ణ బాలమురళి పాత్రలో ఒదిగిపోయిన తీరును అభినందిస్తున్నారు. వీరితోపాటు సూర్యకు తెలుగులో డబ్బింగ్ చెప్పిన వ్యక్తి గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు అతనే హీరో సత్య‌దేవ్. సూర్యకు ఇంతకుముందు కార్తీ కొన్ని సినిమాలకు డబ్బింగ్ చెప్పాడు. కానీ, ఇప్పుడు సత్య2దేవ్ తన గాత్రాన్ని దానం చేయగా అభినందనలు అందుకుంటున్నాడు.

ఏకంగా హీరో సూర్యనే సత్యదేవ్ గురించి ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. సత్యదేవ్..నీ వాయిస్ చాలా బాగుంది..మహా క్యారెక్టర్‌కు ప్రాణం పోసావ్..అంటూ థాంక్స్ చెప్పాడు. దీనిపై స్పందించిన సత్యదేవ్..అన్నా.. లవ్ యూ, చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. డైరెక్టర్ హేమంత్ మధుకర్ కూడా సత్య‌దేవ్‌ను ప్రశంసించారు.

 

Tags:    

Similar News