సెలబ్రెటీలపై హీరో సిద్దార్థ్ సెటైర్.. వారిలా మౌనంగా ఉండకండి అంటూ ట్వీట్
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులు ప్రజలలో తీవ్ర భయాందోళనలను కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నైట్ కర్ప్యూ పెట్టినా ప్రయోజనం లేకుండా పోతుంది. ఈ విషయమై ఒక్కరు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడం గమనార్హం. వీటిపై అందరు గళమెత్తాలని హీరో సిద్దార్థ్ పిలుపునిచ్చారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వ్యవస్థలపై ఘాటు వ్యాఖ్యలు చేసే సిద్దార్థ్ ప్రస్తుతం సెలెబ్రెటీలపై ట్విట్టర్ వేదికగా […]
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులు ప్రజలలో తీవ్ర భయాందోళనలను కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నైట్ కర్ప్యూ పెట్టినా ప్రయోజనం లేకుండా పోతుంది. ఈ విషయమై ఒక్కరు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడం గమనార్హం. వీటిపై అందరు గళమెత్తాలని హీరో సిద్దార్థ్ పిలుపునిచ్చారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వ్యవస్థలపై ఘాటు వ్యాఖ్యలు చేసే సిద్దార్థ్ ప్రస్తుతం సెలెబ్రెటీలపై ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
People with millions of followers are staying silent and watching this horror show. They have their reasons. What are yours? Speak up. Ask questions. Demand care and reassurance from your government. This is going to take a long time to overcome. Wake up. #IndiaWillOvercome
— Siddharth (@Actor_Siddharth) April 27, 2021
“మిలియన్ ఫాలోవర్స్ ఉన్న సెలెబ్రెటీలు ఈ సమయంలో మౌనంగా ఉన్నారు.. వారు మాట్లాడకపోవడానికి వారి కారణాలు వారికి ఉన్నాయి. ఈ హర్రర్ షో చూస్తూ వారిలానే మీరెందుకు ఉంటున్నారు. వారు ప్రశ్నించుకుంటే మీరు ప్రశ్నించండి.. ప్రభుత్వంను ప్రశ్నించాల్సిన బాధ్యత మీకు ఉంది కదా? భద్రత మరియు భరోసా విషయమై మీరే ప్రభుత్వాన్ని ప్రశ్నించండి లేదంటే ఇది ఇలాగే కొనసాగుతుంది ” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారుతుంది. ఇన్ డైరెక్ట్ గా సిద్దార్థ్ సెలెబ్రెటీలకు, ప్రభుత్వంతో అవసరముంటుంది.. అందుకే వారు ఇలాంటి విషయాలపై మాట్లాడారు.. మీ భరోసా మీరే చూసుకోవాలి అని సామాన్యులకు సూచిస్తున్నాడని ఈ ట్వీట్ ద్వారా తెలుస్తుంది. ఇకపోతే ప్రస్తుతం సిద్దు, శర్వానంద్ తో కలిసి ‘మహాసముద్రం’ లో నటిస్తున్నాడు.