అక్కడ అందరికీ కరోనా నెగెటివ్
దిశ, స్పోర్ట్స్: కరోనా మహమ్మారి కాలంలో నిర్వహిస్తున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) అందరికీ శుభవార్త చెప్పింది. మరో ఐదు రోజుల్లో సీపీఎల్( Caribbean Premier League) ప్రారంభం కానుండగా ఇప్పటికే ఆటగాళ్లు(Players), సహాయక సిబ్బంది(Support staff), మ్యాచ్ అధికారులు(Match officials) అందరూ బయో బబుల్(Bio Bubble) వాతావరణంలోకి వెళ్లిపోయారు. బయోబబుల్‌లోకి ప్రవేశించ ముందు ఒక సారి కరోనా పరీక్షలు(Corona tests) నిర్వహించగా నెగెటివ్(Negative)వచ్చింది. తాజాగా మరో సారి అందరికీ కరోనా పరీక్షల్లో నెగెటివ్ ఫలితం రావడంతో […]
దిశ, స్పోర్ట్స్: కరోనా మహమ్మారి కాలంలో నిర్వహిస్తున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) అందరికీ శుభవార్త చెప్పింది. మరో ఐదు రోజుల్లో సీపీఎల్( Caribbean Premier League) ప్రారంభం కానుండగా ఇప్పటికే ఆటగాళ్లు(Players), సహాయక సిబ్బంది(Support staff), మ్యాచ్ అధికారులు(Match officials) అందరూ బయో బబుల్(Bio Bubble) వాతావరణంలోకి వెళ్లిపోయారు.
బయోబబుల్‌లోకి ప్రవేశించ ముందు ఒక సారి కరోనా పరీక్షలు(Corona tests) నిర్వహించగా నెగెటివ్(Negative)వచ్చింది. తాజాగా మరో సారి అందరికీ కరోనా పరీక్షల్లో నెగెటివ్ ఫలితం రావడంతో ఊపిరి పీల్చుకుంది. జట్లన్నీ(All Teams) తమ ప్రాక్టీస్(Practice) ప్రారంభించవచ్చని సీపీఎల్ యాజమాన్యం(CPL management) స్పష్టం చేసింది. కాగా, మ్యాచ్ అఫీషియల్స్ (Match officials), టీవీ క్రూ మాత్రం బయో బబుల్‌లో ఇష్టానుసారం తిరగవద్దని హెచ్చరికలు జారీ చేసింది.
‘ట్రినిడాడ్ అండ్ టొబాగో(Trinidad and Tobago) ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ(Ministry of Health), సీపీఎల్ మెడికల్ సలహా కమిటీ(CPL Medical Advisory Committee)లు కలసి అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాం. నెగెటివ్ వచ్చిన వారినే బయోబబుల్‌లోకి అనుమతించాం. తాజాగా చేసిన పరీక్షల్లో మరోసారి నెగెటివ్(Negative) వచ్చింది. లీగ్ పూర్తయ్యే వరకు అనుమానం వచ్చిన ప్రతీసారి పరీక్షలు చేస్తూనే ఉంటాము’ అని సీపీఎల్ 2020 టోర్నీ ఆపరేషన్స్ డైరెక్టర్ మైఖేల్ హాల్(Michael Hall, Director of CPL 2020 Tournament Operations) తెలిపాడు. కాగా, ట్రినిడాడ్ అండ్ టొబాగో రాకముందే జరిపిన పరీక్షల్లో ఐదుగురికి పాజిటివ్ రాగా వారిని ఈ సీజన్(Season)కు దూరం పెట్టారు.