డిజిటల్ ఫార్మాట్‌లో మాటలు, పాటలు.. సొంత NFTలను సృష్టించడం ఎలా.?
దిశ, ఫీచర్స్ : ఇటీవలే ఓ జిఫ్.. ఆన్‌లైన్ వేలంలో $60,000కు అమ్ముడుపోయింది. వినడానికి షాకింగ్‌గా అనిపించవచ్చుగానీ, ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే మొట్టమొదటి ట్వీట్ $2.9 మిలియన్లకు విక్రయించారని తెలిస్తే మరింత ఆశ్చర్యపోతారు. ఇది ‘ఎన్‌ఎఫ్‌టీ’(నాన్ ఫంజిబుల్ టోకెన్) క్రెడిట్ కాగా.. క్రిప్టోకరెన్సీతో సమానంగా ఆదరణ పొందుతోంది. ఇక ఎన్‌ఎఫ్‌టీ అంటే డిజిటల్ ఆస్తులనే విషయం తెలిసిందే. మాటలు, పాటలు, ఆటలు, బొమ్మలు, వీడియోస్, కామిక్స్‌ను డిజిటల్ ఫార్మాట్‌లోకి మార్చి బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా […]
దిశ, ఫీచర్స్ : ఇటీవలే ఓ జిఫ్.. ఆన్‌లైన్ వేలంలో $60,000కు అమ్ముడుపోయింది. వినడానికి షాకింగ్‌గా అనిపించవచ్చుగానీ, ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే మొట్టమొదటి ట్వీట్ $2.9 మిలియన్లకు విక్రయించారని తెలిస్తే మరింత ఆశ్చర్యపోతారు. ఇది ‘ఎన్‌ఎఫ్‌టీ’(నాన్ ఫంజిబుల్ టోకెన్) క్రెడిట్ కాగా.. క్రిప్టోకరెన్సీతో సమానంగా ఆదరణ పొందుతోంది. ఇక ఎన్‌ఎఫ్‌టీ అంటే డిజిటల్ ఆస్తులనే విషయం తెలిసిందే. మాటలు, పాటలు, ఆటలు, బొమ్మలు, వీడియోస్, కామిక్స్‌ను డిజిటల్ ఫార్మాట్‌లోకి మార్చి బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా వేలంలో విక్రయిస్తారు. క్రిప్టో కరెన్సీ మాదిరే ఈ ఆర్ట్ వర్క్ కూడా ఫుల్ సెక్యూర్డ్‌గా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ‘ఫైన్ ఆర్ట్’ నిర్వచనాన్ని పునఃపరిశీలించి, ఎన్‌ఎఫ్‌టీ వరల్డ్‌లో అన్వేషించేందుకు ఇదే అనువైన సమయంగా భావించొచ్చు. ఈ క్రమంలో సొంత NFTలను సృష్టించడం ఎలానో చూద్దాం!
ఎన్‌ఎఫ్‌టీని సృష్టించేందుకు మొదట ఆన్‌లైన్ వాలెట్‌ను సెటప్ చేయాలి. క్రిప్టో-అసెట్స్ ఇందులో నిల్వ ఉంటాయి. ‘ప్రైవేట్ కీ’ లేకుండా క్రిప్టో యజమాని కరెన్సీని యాక్సెస్ చేయడం అసాధ్యం. ఈ వాలెట్ బ్లాక్‌చైన్ గ్యాస్ ఫీజులను చెల్లించేందుకు అనుమతించనుండగా.. ఇందుకోసం ముందుగా MetaMask అనే సాఫ్ట్‌వేర్ క్రిప్టోకరెన్సీ వాలెట్‌ను డౌన్‌లోడ్ చేయాలి. ఇది మొబైల్ యాప్ ద్వారా ఈథేరియం(Ethereum)వాలెట్‌ను యాక్సెస్ చేసేందుకు వినియోగదారులను అనుమతిస్తుంది. వాలెట్‌ను Metamaskకు లింక్ చేసిన తర్వాత సొంత NFTలను సృష్టించుకునే వీలుంటుంది. ఆ తర్వాత nftically.comకి నావిగేట్ చేసి, మెనూ బార్‌లోని ‘క్రియేట్ స్టోర్’ బటన్‌ను క్లిక్ చేస్తే మీ డాష్‌బోర్డ్‌కు వెళ్తారు. అక్కడ మీరు స్టోర్‌ను సెటప్ చేయాల్సి ఉంటుంది.
లిస్ట్ ఆన్ ద మార్కెట్ ప్లేస్..
ఎన్‌ఎఫ్‌టీ సేకరణ కోసం ఒక పేరును ఎంచుకోండి. ఆపై ‘యాడ్ న్యూ ఐటెమ్’ బటన్‌ను క్లిక్ చేయాలి. మీరు మీ స్టోర్‌కు పేరు పెట్టిన తర్వాత, దిగువన కుడి వైపున ఉన్న ‘క్రియేట్ స్టోర్’ ట్యాబ్‌ను నొక్కగానే స్టోర్ ప్రారంభమవుతుంది. అప్పుడు స్టోర్ సెట్టింగ్స్ పేజీలోకి ఎంటర్ అవుతారు. అక్కడ మీ ప్రాధాన్యత ప్రకారం సెటప్ చేసుకోవచ్చు. అలాగే, హైలైట్ చేసిన లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా మీ స్టోర్‌ను సందర్శించవచ్చు.
క్రియేట్ యువర్ కలెక్షన్..
మీరు మీ బ్లాగ్‌కు హైలైట్ చేసిన లింక్‌పై క్లిక్ చేసినప్పుడు మీ NFT స్టోర్‌కు ఎంటర్ అవుతారు. ఇప్పుడు ‘క్రియేట్ కలెక్షన్’ ట్యాబ్‌పై క్లిక్ చేయడం ద్వారా మన క్రియేషన్‌ను యాడ్ చేసుకోవచ్చు. దీని తర్వాత ఎన్‌ఎఫ్‌టీ జాబితా చేయగల చిత్రం, వీడియో లేదా ఆడియోను అప్‌లోడ్ చేయమని నోటిఫికేషన్ వస్తుంది. పేరు, కళకు సంబంధించిన వివరణను కూడా అక్కడ అందించవచ్చు. ఇప్పుడు ధరను నిర్ణయించి జాబితాను పోస్ట్ చేయాలి.
సెల్లింగ్ ఎన్‌ఎఫ్‌టీ..
మొదటి NFTను విక్రయించడానికి బ్లాక్‌చైన్ లావాదేవీ అవసరం. దాని కోసం మీరు గ్యాస్ ఫీజు చెల్లించాల్సిందిగా కోరబడతారు. మీ మెటామాస్క్‌కు కొంత ఈథర్ కాయిన్స్ యాడ్ చేయాలి. మీరు మొదటిసారి NFT సేకరణను సృష్టించినప్పుడు మాత్రమే ఈ రుసుమును చెల్లించాలి. వినియోగదారులు తమ స్మార్ట్ కాంట్రాక్టులను బ్లాక్‌చైన్‌లో ముద్రించడానికి చెల్లించే లావాదేవీల రుసుమునే ‘గ్యాస్ ఫీజు’ అంటారు.
మార్కెట్‌లోని నిర్దిష్ట క్రిప్టోకరెన్సీ డిమాండ్ రేటు ప్రకారం ఫీజు విలువ మారుతుంది. ఇప్పుడు మీ డిజిటల్ ఆస్తి మార్కెట్‌ప్లేస్‌లో చేర్చబడింది. ఇక ఎవరైనా, ఎప్పుడైనా మార్కెట్‌ప్లేస్‌లో దాన్ని కొనుగోలు చేయవచ్చు.