సిద్దిపేటలో భారీగా నిలిచిపోయిన వాహనాలు
దిశ, సిద్దిపేట: గత 15 రోజుల నుంచి వరిధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో పోసి పడి గాపులు కాస్తున్నా నేటికీ ధాన్యాన్ని కొనుగోలు చేయడంలేదంటూ హన్మకొండ సిద్దిపేట రహదారిపై దర్గాపల్లి గ్రామ రైతులు ఆందోళన చేపట్టారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతులు ఆందోళన చేయడంతో రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్, పోలీసులు అక్కడికి చేరుకుని రైతులకు నచ్చ చెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా […]
దిశ, సిద్దిపేట: గత 15 రోజుల నుంచి వరిధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో పోసి పడి గాపులు కాస్తున్నా నేటికీ ధాన్యాన్ని కొనుగోలు చేయడంలేదంటూ హన్మకొండ సిద్దిపేట రహదారిపై దర్గాపల్లి గ్రామ రైతులు ఆందోళన చేపట్టారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతులు ఆందోళన చేయడంతో రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్, పోలీసులు అక్కడికి చేరుకుని రైతులకు నచ్చ చెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ… రేపటిలోగా అన్ని గ్రామాల్లో కొనుగోళ్లు ప్రారంభించి ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలన్నారు. లేకపోతే తమ ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని ధ్వజమెత్తారు.