నైరుతి ఎఫెక్ట్ : తెలంగాణలో జోరుగా వానలు..

దిశ, వెబ్‌డెస్క్: నైరుతి రుతుపవనాల ఆగమనంతో తెలంగాణలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలతో పాటు హైదరాబాద్ మహానగరంలో జోరుగా వర్షం పడింది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ప్రారంభమైన వర్షం రాత్రి 9 గంటలైనా తగ్గుముఖం పట్టలేదు. నగరంలోని నారాయణగూడ, హిమాయత్ నగర్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, పంజాగుట్ట, అమీర్ పేట, మలక్ పేట, దిల్‌సుఖ్ నగర్, ఎల్బీనగర్, జూబ్లీహిల్స్, […]

Update: 2021-06-10 10:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: నైరుతి రుతుపవనాల ఆగమనంతో తెలంగాణలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలతో పాటు హైదరాబాద్ మహానగరంలో జోరుగా వర్షం పడింది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ప్రారంభమైన వర్షం రాత్రి 9 గంటలైనా తగ్గుముఖం పట్టలేదు. నగరంలోని నారాయణగూడ, హిమాయత్ నగర్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, పంజాగుట్ట, అమీర్ పేట, మలక్ పేట, దిల్‌సుఖ్ నగర్, ఎల్బీనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బేగంపేట, సికింద్రాబాద్ మొదలకు ప్రాంతాల్లో జోరుగా వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో నగర వాసులు ఆహ్లాదాన్ని పొందారు. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా సాయంత్రం 5 గంటల వరకు మినహాయింపు ఇవ్వడంతో వాహనదారులు రోడ్లపై కనిపించగా, వర్షం ధాటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తినట్లు సమాచారం.

Tags:    

Similar News