కామారెడ్డి జిల్లాలో వడగండ్ల వాన

దిశ, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున వడగండ్ల వర్షం కురిసింది. శనివారం సాయంత్రం కామారెడ్డి జిల్లా బిక్కనూర్, బీబీపేట్ మండలాల్లో 40 నిమిషాల పాటు ఏకధాటిగా రాళ్ల వర్షం కురిసింది. భారీ వర్షానికి తోడు ఈదురు గాలులు వీయడంతో చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్థంబాలు కూలిపోయాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో చేతికొచ్చిన పంట కళ్ళ ముందే నీటి పాలు కావడంతో రైతుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. అకాల వర్షంతో కామారెడ్డి జిల్లాలో రైతులకు తీవ్ర […]

Update: 2020-05-09 09:39 GMT

దిశ, నిజామాబాద్ :
కామారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున వడగండ్ల వర్షం కురిసింది. శనివారం సాయంత్రం కామారెడ్డి జిల్లా బిక్కనూర్, బీబీపేట్ మండలాల్లో 40 నిమిషాల పాటు ఏకధాటిగా రాళ్ల వర్షం కురిసింది. భారీ వర్షానికి తోడు ఈదురు గాలులు వీయడంతో చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్థంబాలు కూలిపోయాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో చేతికొచ్చిన పంట కళ్ళ ముందే నీటి పాలు కావడంతో రైతుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. అకాల వర్షంతో కామారెడ్డి జిల్లాలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఏప్రిల్ చివరి వారంలో కురిసిన అకాల వర్షానికి 540 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావడంతో రైతులు చేతికి వచ్చిన పంటను నష్టపోతున్నారు.

Tags:    

Similar News