హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం..

దిశ, వెబ్‌‌డెస్క్ : హైదరాబాద్ మహా నగరంలో ఉదయం 6 గంటల ప్రాంతం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. లాక్‌డౌన్ మినహాయింపు సమయంలో ప్రతిరోజూ జనాలు తమకు కావాల్సిన అత్యవసరాలను తీసుకునేందుకు బయటకు వస్తుంటారు. అయితే, ఈ రోజు ఉదయం నుంచే వర్షం కురుస్తుండటంతో వ్యాపారులు మినహా బయట జనం ఎక్కువగా కనిపించం లేదు. నగరంలోని రద్దీ ప్రాంతాలైన అమీర్ పేట, పంజాగుట్ట, నారాయణగూడ, చిక్కడపల్లి, సికింద్రాబాద్, మలక్ పేట, దిల్‌సుఖ్ నగర్, ఎల్బీనగర్, జూబ్లీహిల్స్, […]

Update: 2021-05-17 20:12 GMT

దిశ, వెబ్‌‌డెస్క్ : హైదరాబాద్ మహా నగరంలో ఉదయం 6 గంటల ప్రాంతం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. లాక్‌డౌన్ మినహాయింపు సమయంలో ప్రతిరోజూ జనాలు తమకు కావాల్సిన అత్యవసరాలను తీసుకునేందుకు బయటకు వస్తుంటారు. అయితే, ఈ రోజు ఉదయం నుంచే వర్షం కురుస్తుండటంతో వ్యాపారులు మినహా బయట జనం ఎక్కువగా కనిపించం లేదు.

నగరంలోని రద్దీ ప్రాంతాలైన అమీర్ పేట, పంజాగుట్ట, నారాయణగూడ, చిక్కడపల్లి, సికింద్రాబాద్, మలక్ పేట, దిల్‌సుఖ్ నగర్, ఎల్బీనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లాంటి ప్రాంతాల్లో వర్షం జోరుగా కురుస్తున్నట్లు తెలుస్తోంది. పలు ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో నగరంలో చీకట్లు ఆవరించాయి. కాగా, నిన్న తౌక్తే తుఫాన్ గుజరాత్ తీరాన్ని తాకడం వల్లే దక్షిణ భారతంలో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

Tags:    

Similar News