రాష్ట్రంలో మూడ్రోజులు వర్షాలు
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో మూడ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈశాన్య మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల నుంచి 3.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో 2.1కిలోమీటర్ల నుండి 5.8కిలోమీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొన్నారు. దీని ప్రభావం కారణంగా […]
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో మూడ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈశాన్య మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల నుంచి 3.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో 2.1కిలోమీటర్ల నుండి 5.8కిలోమీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొన్నారు. దీని ప్రభావం కారణంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.
ఇదిలా ఉండగా బుధవారం సాయంత్రం రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్‌లో వర్షం కురిసింది. ఉదయం నుంచి వేడెక్కిన వాతావరణం సాయంత్రం వర్షంతో చల్లబడింది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురవడంతో రోడ్లపై నీరు నిలిచింది. బుధవారం ఉదయం వరకు రాష్ట్రంలోని వివిధజిల్లాలో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మంచిర్యాల జిల్లా నెన్నెలలో 76.8, సూర్యాపేట జిల్లా పెన్‌పహడ్‌లో 66.5, చింతలపాలెంలో 55 మి.మి. వర్షం కురిసింది. అత్యధిక వర్షపాతం 76.8 మి.మి. కాగా అత్యల్పంగా ఖమ్మం జిల్లాలో 22.3 మి.మి.గా నమోదైంది.