మూడ్రోజుల పాటు వర్షాలు

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో మూడ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో ఆగష్టు 4న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీంతో మూడ్రోజుల పాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. శనివారం హైదరాబాద్‌నగరంలో వాన […]

Update: 2020-08-01 04:47 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో మూడ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో ఆగష్టు 4న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీంతో మూడ్రోజుల పాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది.

శనివారం హైదరాబాద్‌నగరంలో వాన దంచికొట్టింది. హయత్‌నగర్, ఎల్బీనగర్, కొత్తపేట, దిల్‌సుఖ్‌నగర్, సికింద్రాబాద్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. రోడ్లు మొత్తం జలమయమై వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.

Tags:    

Similar News