వ‌రంగ‌ల్‌లో భారీవర్షం.. నీట మునిగిన కాల‌నీలు

దిశ‌ప్రతినిధి, వరంగ‌ల్ : వ‌రంగ‌ల్‌లో భారీ వ‌ర్షానికి అనేక‌ కాల‌నీలు జ‌ల‌మ‌యమ‌య్యాయి. మంగ‌ళ‌వారం అర్ధరాత్రి త‌ర్వాత మొద‌లైన వ‌ర్షం బుధ‌వారం ఉద‌యం 7గంట‌ల‌ వరకు కురిసింది. వ‌రంగ‌ల్‌, హ‌న్మకొండ‌, కాజీపేట ప్రాంతంలోని అనేక లోత‌ట్టు కాల‌నీలు నీట మునిగాయి. వ‌డ్డెప‌ల్లి, హ‌న్మకొండ టీచ‌ర్ కాల‌నీ ఫేజ్‌-1, నయీంనగ‌ర్‌, గోపాల్‌పూప‌ర్‌, కాజీపేట డీజిల్‌కాల‌నీ ఏరియాల్లో రోడ్లపై నీరు భారీగా నిలిచింది. డ్రెయినేజీలు మూసుకుపోవడంతో రోడ్లపైనే వ‌ర‌ద నీరు భారీగా నిలిచిపోయింది. రెండు రోజుల పాటు వ‌ర్షం కురిసే అవ‌కాశం […]

Update: 2021-06-08 21:28 GMT
వ‌రంగ‌ల్‌లో భారీవర్షం.. నీట మునిగిన కాల‌నీలు
  • whatsapp icon

దిశ‌ప్రతినిధి, వరంగ‌ల్ : వ‌రంగ‌ల్‌లో భారీ వ‌ర్షానికి అనేక‌ కాల‌నీలు జ‌ల‌మ‌యమ‌య్యాయి. మంగ‌ళ‌వారం అర్ధరాత్రి త‌ర్వాత మొద‌లైన వ‌ర్షం బుధ‌వారం ఉద‌యం 7గంట‌ల‌ వరకు కురిసింది. వ‌రంగ‌ల్‌, హ‌న్మకొండ‌, కాజీపేట ప్రాంతంలోని అనేక లోత‌ట్టు కాల‌నీలు నీట మునిగాయి. వ‌డ్డెప‌ల్లి, హ‌న్మకొండ టీచ‌ర్ కాల‌నీ ఫేజ్‌-1, నయీంనగ‌ర్‌, గోపాల్‌పూప‌ర్‌, కాజీపేట డీజిల్‌కాల‌నీ ఏరియాల్లో రోడ్లపై నీరు భారీగా నిలిచింది. డ్రెయినేజీలు మూసుకుపోవడంతో రోడ్లపైనే వ‌ర‌ద నీరు భారీగా నిలిచిపోయింది. రెండు రోజుల పాటు వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ సూచ‌న‌ల‌తో లోత‌ట్టు ప్రాంత ప్రజ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. చిన్నపాటి వ‌ర్షానికే వ‌రంగ‌ల్ న‌గ‌రంలోని అనేక కాల‌నీలు జ‌ల‌మ‌య‌మ‌వుతున్నా గ్రేట‌ర్ అధికారులు మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రెయినేజీలకు మ‌ర‌మ్మతులు నిర్వహించ‌డం, వెడ‌ల్పు వంటి ప‌నులు చేయ‌కుండా నిర్లక్ష్యంగా వ్యవ‌హ‌రిస్తుండ‌టంతోనే కాల‌నీలు గోదారుల‌ను త‌ల‌పిస్తున్నాయ‌ని సామాన్య జ‌నం మండిపడుతున్నారు.

 

Tags:    

Similar News