తెలంగాణకు భారీ వర్ష సూచన

దిశ, వెబ్‌డెస్క్: అక్టోబర్ 9న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం దక్షిణ కోస్తా నుంచి ఒడిశా పరిసర ప్రాంతాల వరకు 5.8కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీనికి తోడు అల్పపడీనం ఏర్పడి అది 24గటంటల వ్యవధిలో వాయువ్య దిశగా ప్రయాణం చేసి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. 10రోజుల క్రితం రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు […]

Update: 2020-10-06 07:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: అక్టోబర్ 9న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం దక్షిణ కోస్తా నుంచి ఒడిశా పరిసర ప్రాంతాల వరకు 5.8కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీనికి తోడు అల్పపడీనం ఏర్పడి అది 24గటంటల వ్యవధిలో వాయువ్య దిశగా ప్రయాణం చేసి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. 10రోజుల క్రితం రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో వాగులు, చెరువులు పొంగి పొర్లగా లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు రెండ్రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Tags:    

Similar News