చికెన్, మటన్‌లో ఏది ఎక్కువ తింటే ఆరోగ్యానికి మంచిదంటే?
రోజు రోజుకు నాన్ వెజ్ ప్రియుల సంఖ్య పెరిగిపోతుంది. ఒకప్పుడు సండే వస్తే చాలు, ప్రతి ఇల్లూ మసాలా వాసనలతో గుప్పుమనేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. వారంలో రెండు సార్లు, బుధవారం,
దిశ, ఫీచర్స్ : రోజు రోజుకు నాన్ వెజ్ ప్రియుల సంఖ్య పెరిగిపోతుంది. ఒకప్పుడు సండే వస్తే చాలు, ప్రతి ఇల్లూ మసాలా వాసనలతో గుప్పుమనేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. వారంలో రెండు సార్లు, బుధవారం, ఆదివారం నాన్ వెజ్ తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే కొంత మంది చికెన్ తినడానికి ఎక్కువ ఇష్టపడుతే, ఇంకొంత మంది మాత్రం మటన్ తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు.
అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం చికెన్ కంటే మటన్ ఎక్కువగా తినాలని సూచిస్తున్నారు.ఎందుకంటే చికెన్ అతిగా తినడం వలన గుండె చుట్టు కొవ్వు విపరీతంగా పెరిగిపోయి, గుండెపోటు వచ్చే అవకాశం ఉన్నదంట. అంతే కాకుండా ఈరోజుల్లో కోళ్లను కూడా ఇంజెక్షన్స్ వేసి పెంచుతున్నారు దీని వలన క్యాన్సర్ వంటి సమస్యలు దరి చేరే అవకాశం ఉంది, అందువలన చికెన్ కంటే మటన్ తినడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. మటన్ వారానికి రెండు సార్లు తిన్నా ఎలాంటి సమస్యలు రావంట. దీని వలన ఆరోగ్యానికి కూడా చాలా మంచి జరుగుతుందని వారు సూచిస్తున్నారు. నోట్ : పై వార్తను దిశ ధృవీకరించడం లేదు. ఇంటర్ నెట్‌లో లభించిన సమాచారం ఆధారం, వివిధ నిపుణులు, వైద్యులు పేర్కొన్న సూచనల మేరకు మాత్రమే ఇవ్వబడింది