లైంగిక వాంఛను తగ్గించేందుకు థెరపీ& మెడికేషన్ ..
దిశ, ఫీచర్స్ : కంపల్సివ్ సెక్సువల్ బిహేవియర్(బలవంతపు లైంగిక ప్రవర్తన) జీవితంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలను చూపుతుంది..Latest Telugu News
దిశ, ఫీచర్స్ : కంపల్సివ్ సెక్సువల్ బిహేవియర్(బలవంతపు లైంగిక ప్రవర్తన) జీవితంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. లైఫ్‌లో రిపిటేటివ్ సెక్సువల్ ప్రోగ్రామ్‌కు ప్రాముఖ్యతనిస్తూ ఆరోగ్యం, వ్యక్తిగత రక్షణ, ఆసక్తులు, బాధ్యతలను విస్మరించే స్థాయికి చేరుకుంటారు. కేవలం శృంగారమనే లోకంలో బతికేస్తుంటారు. ప్రతికూల పరిణామాలున్నాయని తెలిసినా.. సంతృప్తి పొందకపోయినా సరే కామ వాంఛతోనే కాలం గడిపేస్తుంటారు. ఇలాంటి పరిస్థితిని మెంటల్ డిజార్డర్‌గా పరిగణించాలంటున్న నిపుణులు.. దీన్ని గుర్తించడం పార్ట్‌నర్‌కే సాధ్యం అవుతుందని, అయితే దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరముందని చెప్తున్నారు.
కామన్ బిహేవియర్స్ :
బలవంతపు లైంగిక ప్రవర్తన కలిగిన వ్యక్తులు వివిధ లైంగిక పద్ధతులపై స్థిరపడవచ్చు. కొంతమంది హస్తప్రయోగం పట్ల విపరీతమైన కోరికతో ఉంటే.. మరికొందరు రోజుకు అనేక మంది భాగస్వాములతో సెక్స్‌లో పాల్గొంటారు. ఈ వేరియేషన్ అనేది వారి పరిస్థితిని కనుగొనడాన్ని కష్టతరం చేస్తుంది.యాక్టివిటీస్ :
* బలవంతపు హస్త ప్రయోగం
* మల్టిపుల్ ఎఫైర్స్, సెక్సువల్ పార్ట్‌నర్స్, వన్ నైట్ స్టాండ్స్
* నిరంతరం పోర్న్ కంటెంట్ చూడటం
* అసురక్షిత శృంగారంలో పాల్గొనడం
* సైబర్ సెక్స్
* సెక్స్ వర్కర్స్‌తో ఇంటర్‌కోర్స్
బిహేవియర్స్ అండ్ యాటిట్యూడ్స్ :
* లైంగిక కోరికలను కలిగి ఉండటంలో అసమర్థత
* నిర్లిప్తత.. అంటే లైంగిక చర్య ఆ వ్యక్తిని మానసికంగా సంతృప్తిపరచదు
* నిరంతరం ప్రేమలో ఉండటం. కొత్త ప్రేమ కథలు ప్రారంభించి, రొమాన్స్‌లో పాల్గొనడం వంటివి ఎక్కువ మందితో ఎఫైర్‌కు కారణం
* అపరాధం, అవమాన భావాలను మోయడం
*సెక్సువల్ స్టిమ్యులేషన్ కోసం సామాజిక, పని సంబంధిత లేదా వినోద కార్యకలాపాలను వదులుకోవడం
కాంప్లికేషన్స్(చిక్కులు):
*కంపల్సివ్ సెక్సువల్ బిహేవియర్‌కు సాక్ష్యాలు ఉన్నప్పటికీ నిర్ధారించడం కష్టం. దీంతో సదరు వ్యక్తితో పాటు చుట్టూ ఉన్న చాలా మంది ప్రభావితం అవుతారు.
*పైగా ఈ పరిస్థితుల్లో చికిత్స అందించకపోతే అపరాధ భావం పెరిగి ఆత్మగౌరవం తగ్గిపోతుంది. ఇంకొందరిలో డిప్రెషన్, యాంగ్జయిటీకి కూడా దారితీస్తుంది.
*కుటుంబం బంధాలు విచ్ఛిన్నమవుతాయి. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టేస్తాయి.
*లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులతో సతమతమవుతారు.
కారణాలు :
కంపల్సివ్ సెక్సువల్ బిహేవియర్‌కు కారణమేంటనేది ఇప్పటికీ స్పష్టం కాలేదు. కానీ బ్రెయిన్‌లోని రివార్డ్ సిస్టమ్ అండ్ సర్క్యూట్స్ ఈ అడిక్షన్‌కు దారితీస్తాయని, డిప్రెషన్ లాంటి మెంటల్ హెల్త్ కండిషన్స్ కూడా ఈ పరిస్థితికి కారణమవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు బాధ, ఒంటరితనం, సంతోషం.. లాంటి పరిస్థితులు ఈ కండిషన్‌కు రీజన్ అని చెప్తున్నారు. డయాగ్నసిస్ ఎలా ?
నిర్బంధ లైంగిక ప్రవర్తనకు సంబంధించిన రోగనిర్ధారణ ప్రమాణాలకు సంబంధించి చర్చ కొనసాగుతోంది. పరిస్థితిని నిర్ధారించేందుకు వివిధ రకాల ప్రమాణాలు ఉన్నాయి. అయితే కొన్ని అధ్యయనాల ప్రకారం కంపల్సివ్ సెక్సువల్ బిహేవియర్ అనేది అధికారికంగా నిర్ధారణ కాలేదు. మెడికల్ కండిషన్‌గా చూపేందుకు సరైన, విశ్వసనీయమైన మూలం లేదని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. WHO ICD-11లో బలవంతపు లైంగిక ప్రవర్తనగా చేర్చింది.
అయితే బలవంతపు లైంగిక ప్రవర్తన పర్యవసానాల వల్ల పెరుగుతున్న ఉదాహరణలు.. చట్టబద్ధమైన మానసిక స్థితిగా చర్చను విస్తరించాయి. అయినప్పటికీ, ప్రధాన ఆరోగ్య అధికారులు నిర్బంధ లైంగిక ప్రవర్తనను స్వతంత్ర నిర్ధారణ(స్టాండ్‌ఎలోన్ డయాగ్నోసిస్)గా చేర్చడానికి ముందు మరింత అనుభావిక ఆధారాలు అవసరం.
ట్రీట్మెంట్ :
బలవంతపు లైంగిక ప్రవర్తనకు చికిత్స చేయడం కష్టం. ఎందుకంటే ఒక వ్యక్తితో బలవంతపు లైంగిక ప్రవర్తనలో పాల్గొనే వ్యక్తులు సమస్య ఉందని తిరస్కరిస్తే.. తన ప్రవర్తనలు, ఆలోచనా విధానాలను నియంత్రించుకోవచ్చు. అందుకే మానసిక ఆరోగ్య లక్షణాలు, లైంగిక కోరికలను తగ్గించంపై చికిత్సా విధానాలు దృష్టిపెట్టాయి. ఈ పద్ధతులు ఆరోగ్యకరమైన అలవాట్లు, హెల్తీ రిలేషన్‌షిప్స్‌ను ప్రోత్సహించడానికి ఉపయోగపడతాయి. *ప్రిస్క్రిప్షన్ మందులు: వీటిలో మెడ్రాక్సీప్రోజెస్టెరాన్ (ప్రోవెరా), ఫ్లూక్సేటైన్ (ప్రోజాక్)తో సహా సెలెక్టివ్ సెరోటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్ (SSRI) వంటి యాంటీ-ఆండ్రోజెన్‌లు ఉండవచ్చు. లైంగిక కోరికలను తగ్గించడానికి వైద్యుడు ఈ మందులను సూచించినప్పటికీ, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ఈ పరిస్థితికి చికిత్స చేయడానికి ఎలాంటి మందులను ఆమోదించలేదు.
మద్దతు :
*బలవంతపు లైంగిక ప్రవర్తన నుంచి కోలుకోవడానికి స్నేహితులు, కుటుంబ సభ్యుల మద్దతు కీలకం. బలవంతపు లైంగిక ప్రవర్తనను ఇతరులు అర్థం చేసుకోవడం, సహించడం కష్టం. ముఖ్యంగా ఇలాంటి బిహేవియర్ ఇప్పటికే బంధాలలో నష్టం కలిగించినట్లయితే సపోర్ట్ చేయడం కష్టమే.
*అయితే బలమైన సపోర్ట్ నెట్‌వర్క్ అవాంఛిత లైంగిక ప్రవర్తనను తగ్గించడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన లైంగికతని సృష్టించేందుకు తోడ్పడవచ్చు.