Health Tips: Trivikramasana వల్ల కలిగే ప్రయోజనాలు?

దిశ, ఫీచర్స్: ఈ ఆసనంలో మొదటగా బల్లపరుపు నేలపై వెల్లకిలా పడుకోవాలి. కాళ్లు నిటారుగా చాచి రెండు నిమిషాలపాటు శ్వాస తీసుకుంటూ వదిలేయాలి..Latest Telugu News

Update: 2022-08-27 03:20 GMT

దిశ, ఫీచర్స్: ఈ ఆసనంలో మొదటగా బల్లపరుపు నేలపై వెల్లకిలా పడుకోవాలి. కాళ్లు నిటారుగా చాచి రెండు నిమిషాలపాటు శ్వాస తీసుకుంటూ వదిలేయాలి. ఇప్పుడు కుడి కాలును నెమ్మదిగా పైకి లేపుతూ పాదాన్ని తలకు దగ్గరగా నేలపై పెట్టాలి. రెండు చేతులతో సపోర్ట్ కూడా తీసుకోవచ్చు. అలా సెట్ అయ్యాక కుడి పాదం బొటనవేలు నేలపై ఉండేలా చూసుకోవాలి. ఎడమకాలు నిటారుగా ఎటూ కదలకుండా ఉండాలి. అధిక పొట్ట ఉన్నవాళ్లకు కాస్త కష్టమైన ఆసనమే. ఇతరుల సాయంతో చేస్తే ప్రయోజనం ఉంటుంది.

ప్రయోజనాలు:

* తుంటి, పొత్తికడుపుకు మంచి వ్యాయమం.

* అంతర్గత బలాన్ని విడుదల చేయడంలో సాయం.

* కండరాలను సాగదీసి బలోపేతం చేస్తుంది.

* రక్త ప్రసరణ, శ్వాస నాళాలను ఉత్తేజపరుస్తుంది.

Tags:    

Similar News