పరిపూర్ణ మత్స్యేంద్రాసన ప్రయోజనాలేంటి?
మొదటగా బల్లపరుపు నేలపై కాళ్లు ముందుకు చాచి కూర్చోవాలి. తర్వాత ఎడమ మోకాలిని మడిచి ఎడమ పాదాన్ని కుడి తొడ పైన పెట్టాలి. తర్వాత కుడి మోకాలిని మడిచి ఛాతికి దగ్గరగా పెట్టాలి.. Latest Telugu News
దిశ, ఫీచర్స్: మొదటగా బల్లపరుపు నేలపై కాళ్లు ముందుకు చాచి కూర్చోవాలి. తర్వాత ఎడమ మోకాలిని మడిచి ఎడమ పాదాన్ని కుడి తొడ పైన పెట్టాలి. తర్వాత కుడి మోకాలిని మడిచి ఛాతికి దగ్గరగా పెట్టాలి. ఇప్పుడు శ్వాస వదులుతూ పూర్తిగా కుడి వైపునకు శరీరాన్ని తిప్పాలి. తర్వాత ఎడమ చేతిని కుడి మోకాలి అవతల నుంచి తీసుకెళ్లి కుడి పాదాన్ని పట్టుకోవాలి. ఈ భంగిమలో వెన్నుముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఇలా సాధ్యమైనంత సేపు ఆగి కాలు మార్చి చేయాలి.
ప్రయోజనాలేంటి?
* వెన్నెముకను పునరుజ్జీవింపజేస్తుంది.
* ఎముకల వశ్యతను మెరుగుపరుస్తుంది.
* నిర్విషీకరణను ప్రోత్సహిస్తుంది.
* జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
* మనసుకు విశ్రాంతినిస్తుంది.
ఇవి కూడా చదవండి :