Marichyasana Yoga: మరీచ్యాసనం ప్రయోజనాలేంటి?
Benefits Of Marichyasana Yoga| మొదటగా రెండు కాళ్లను ముందుకు చాచి కూర్చోవాలి. వెన్నెముకను నిటారుగా ఉంచి.. కుడి మోకాలిని మడిచి కాలును లంబంగా నిలబెట్టాలి. కుడి పాదాన్ని శరీరానికి దగ్గరగా తీసుకురావాలి. తర్వాత కుడి మోకాలి ముందు నుంచి కుడి చేతిని పోనిస్తూ వీపు వెనుకకు తీసుకురావాలి
దిశ, ఫీచర్స్: Benefits Of Marichyasana Yoga| మొదటగా రెండు కాళ్లను ముందుకు చాచి కూర్చోవాలి. వెన్నెముకను నిటారుగా ఉంచి.. కుడి మోకాలిని మడిచి కాలును లంబంగా నిలబెట్టాలి. కుడి పాదాన్ని శరీరానికి దగ్గరగా తీసుకురావాలి. తర్వాత కుడి మోకాలి ముందు నుంచి కుడి చేతిని పోనిస్తూ వీపు వెనుకకు తీసుకురావాలి. అలాగే ఎడమ చేతిని వెనకకు తీసుకొచ్చి ఒక చేతితో మరొక చేతిని పట్టుకోవాలి. ఇప్పుడు తలను నేలపై ఉంచి ఎడమ మోకాలుకు దగ్గరగా కిందకు తీసుకువచ్చి కాసేపు ఆగాలి. ఇలా చేసిన తర్వాత మళ్లీ కుడి కాలు చాపి, ఎడమ మోకాలిని మడిచి చేయాలి. ఈ ఆసనంలో సాధారణ శ్వాస జరపాలి.
ప్రయోజనాలు:
* భుజాలు, వీపు కండరాలను సాగదీస్తుంది.
* హామ్ స్ట్రింగ్స్ సమస్యలకు ఉపశమనం లభిస్తుంది.
* ఒత్తిడిని తగ్గించి మనసుకు ఉల్లాసాన్నిస్తుంది.
* కాలేయం, జీర్ణ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది.
ఇది కూడా చదవండి: భరత వజ్రాసనం.. దాని వల్ల ప్రయోజనాలు